రైతుల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం

రైతుల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం
x
Highlights

ఇప్పటికే పసుపుకుంకుమ, ఉద్యోగుల మధ్యంతర భృతి అందజేత, వృద్ధులకు పెన్షన్ ల పెంపు, అలాగే రైతులకు 10 వేలు సాయం లాంటి నిర్ణయాలు తీసుకున్న ఏపీ ప్రభుత్వం.....

ఇప్పటికే పసుపుకుంకుమ, ఉద్యోగుల మధ్యంతర భృతి అందజేత, వృద్ధులకు పెన్షన్ ల పెంపు, అలాగే రైతులకు 10 వేలు సాయం లాంటి నిర్ణయాలు తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ ఉచిత విద్యుత్‌ సరఫరాను 7 గంటల నుంచి 9 గంటలకు పెంచుతూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 17.85లక్షల పంపు సెట్లు వినియోగించే రైతులు లబ్ధి పొందనున్నారు. ఈ పథకం కింద ప్రస్తుతం ఏడాదికి 12 వేల574 మిలియన్‌ యూనిట్లు విద్యుత్‌ అందిస్తారు. ఇందుకయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ విద్యుత్ సంస్థలకు చెల్లించనుంది. కాగా ఉచిత విద్యుత్‌ను ఏడుగంటల నుంచి 9 గంటలకు పెంచితే భూగర్భజలాలు అట్టగుకు వెళ్లే ప్రమాదం ఉందని అప్పట్లో కొందరు అభిప్రాయపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories