అక్కడ ఎటూ తేల్చుకోలేకపోతున్న టీడీపీ

అక్కడ ఎటూ తేల్చుకోలేకపోతున్న టీడీపీ
x
Highlights

ఏపీలో అన్ని పార్టీలకంటే ముందుగానే అభ్యర్థులను ఫైనల్ చేస్తోంది అధికార టీడీపీ. ప్రతిరోజు ఏదో ఒక పార్లమెంటు నియోజకవర్గంపై సమీక్షలు నిర్వహిస్తూ...

ఏపీలో అన్ని పార్టీలకంటే ముందుగానే అభ్యర్థులను ఫైనల్ చేస్తోంది అధికార టీడీపీ. ప్రతిరోజు ఏదో ఒక పార్లమెంటు నియోజకవర్గంపై సమీక్షలు నిర్వహిస్తూ అభ్యర్థులను ఖరారు చేస్తోంది. దాదాపు 100 కు పైగా అసెంబ్లీ స్థానాల్లో, 15 పార్లమెంటు స్థానాల్లో ఎవరెవరికి టిక్కెట్లు ఇచ్చేది స్పష్టం చేశారు చంద్రబాబు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీకి వింత పరిస్థితి ఎదురవుతోంది. నాలుగున్నరేళ్ల వరకు సీన్ లోకి రాని నేతలు టిక్కెట్ రేసులోకి వస్తున్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం వైసీపీకి కంచుకోట.. గత ఎన్నికల్లో ఆ పార్టీనుంచి

ఎమ్మెల్యేగా గెలిచిన పాలపర్తి డేవిడ్ రాజు పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారు. దాంతో ఆయనపై పోటీ చేసిన టీడీపీ నాయకురాలు బూదాల అజితారావు.. టీడీపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరించారు. పైగా ఈ నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత మున్నె రవీంద్ర ఎక్కువగా జోక్యం చేసుకోవడం ఆమెకు రుచించలేదు. దాంతో ఒకానొక దశలో ఆమె వైసీపీలో చేరేందుకు ప్రయత్నించారని చెబుతుంటారు. ఇక ఎన్నికలు దగ్గరపడుతుండతో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. యర్రగొండపాలెం నుంచి మళ్ళీ పోటీ చేయమని డేవిడ్ రాజుకు ఆదేశించారు. అయితే ఈసారి తాను యర్రగొండపాలెం నుంచి కాకుండా సంతనూతలపాడు నుంచి పోటీ చేస్తానని డేవిడ్ రాజుకు.. చంద్రబాబుకు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బూదాల అజితారావు పోటీ చేస్తానని ముందుకు వచ్చినా.. ఆమె పోటీ చేస్తే సహకరించేది లేదని కీలక నేతలు మున్నె రవీంద్ర, అంబటి వీరారెడ్డి తేల్చిచెప్పారట. దాంతో టీడీపీ అధిష్టానం పునరాలోచనలో పడిందట.. ఒకరేమో పోటీ చేయనని చెబుతుంటే.. మరొకరు పోటీ చేస్తానని ముందుకు వచ్చినా స్థానిక నేతలు సహకారాలేమితో టిక్కెట్ ఇవ్వలేని పరిస్థితి. ఈ క్రమంలో ఎటూ తేల్చుకోలేకపోతోందట టీడీపీ.

Show Full Article
Print Article
Next Story
More Stories