నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

Raj22 Jan 2019 4:35 AM GMT
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. ఏపీలో ఇటీవల ఏర్పాటు చేసిన హైకోర్టు తాత్కాలిక భవనాలను ప్రారంభించడానికి సుప్రీం కోర్ట్ చీఫ్ జడ్జిని ఆహ్వానించనున్నారు. అలాగే రేపు ఢిల్లీలో నాన్ ఎన్టీఏ పార్టీల సమావేశంలో పాల్గొననున్నారు. బెంగళూరు, ఢిల్లీలో నిర్వహించే జాతీయ స్థాయి సభల నిర్వాహణపై ఈ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకోనున్నారు. దేశవ్యాప్తంగా కోల్‌కతా తరహా సభలు పెట్టాలని విపక్షాలు భావిస్తున్నాయి. మరోవైపు కేంద్రం తీరుకు నిరసనగా చేపట్టాల్సిన కార్యక్రమాల షెడ్యూల్‌తో పాటు త్వరలో అమరావతిలో నిర్వహించే ధర్మ పోరాట సభ తేదీలను సీఎం చంద్రబాబునాయుడు త్వరలోనే ఖరారు చేయనున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై జాతీయ స్థాయి పోరాటం చేసే విషయంలో కూడా వివిధ పార్టీల నేతలతో చర్చలు జరిపే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
లైవ్ టీవి
నాటకమైన, సినిమా అయిన ఈయన స్టైల్ వేరు
18 Feb 2019 10:19 AM GMTసినిమా కథలో మలుపులాగానే సంగీత దర్శకుడి జీవితం
18 Feb 2019 10:15 AM GMTసరిహద్దున నువ్వు లేకుంటే ఓ సైనిక!
18 Feb 2019 9:52 AM GMTపుణ్యభూమి నా దేశం నమో నమామీ!
18 Feb 2019 9:44 AM GMTదేవ్...వావ్ అయితే కాదు...
15 Feb 2019 11:03 AM GMT