Chandrababu Naidu Quantum Talk: రేపు క్వాంటం టాక్‌ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Quantum Talk: రేపు క్వాంటం టాక్‌ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
x

Chandrababu Naidu Quantum Talk: రేపు క్వాంటం టాక్‌ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

Highlights

రేపు ఉదయం 9.30 గంటలకు వర్చువల్‌గా సమావేశం టెక్ విద్యార్థులతో ఆన్‌లైన్‌లో మాట్లాడనున్న సీఎం చంద్రబాబు దీర్ఘకాలిక రోడ్‌మ్యాప్‌.. క్వాంటం టెక్నాలజీ లక్ష్యాలను వివరించనున్న సీఎం

ఏపీ సీఎం చంద్రబాబు రేపు క్వాంటం టాక్‌ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉదయం 9.30 గంటలకు వర్చువల్‌గా సమావేశం జరగనుండగా.. టెక్ విద్యార్థులతో మాట్లాడనున్నారు సీఎం. క్వాంటం టెక్నాలజీ లక్ష్యాలు, అందుకు దీర్ఘకాలిక రోడ్‌మ్యాప్‌ను విద్యార్థులకు వివరిస్తారు. ఇప్పటికే క్యూబిక్, వైసర్ సంస్థలతో ఒప్పందం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆ రెండు సంస్థలతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దేశంలో తొలిసారి క్వాంటం విద్యా సదస్సు ద్వారా విద్యార్థుల్లో నైపుణ్య కల్పనకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఏపీ నుంచి లక్ష మంది నిపుణుల్ని తయారుచేయడం లక్ష్యంగా క్వాంటం ప్రోగ్రామ్‌ నిర్వహిస్తోంది. 50వేల మంది విద్యార్థులు, ఐటీ రంగ ఉద్యోగులు ఈ ప్రోగ్రామ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోగా అందులో 51 శాతం పైగా మహిళా టెక్‌ విద్యార్థులున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 3వేల మందికి తదుపరి స్థాయి శిక్షణ అందించనుంది ప్రభుత్వం. 100 మందికి ఐబీఎం, టీసీఎస్‌, సీడాక్‌లలో శిక్షణ అవకాశాలు ఇప్పించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories