వీరికి టిక్కెట్లు కన్ఫామ్ చేసిన చంద్రబాబు!

వీరికి టిక్కెట్లు కన్ఫామ్ చేసిన చంద్రబాబు!
x
Highlights

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గతంలోకంటే ఈసారి ఎక్కువ సీట్లు సాధించాలన్న వ్యూహంతో ముందుకెళుతున్నారు. రోజుకో...

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గతంలోకంటే ఈసారి ఎక్కువ సీట్లు సాధించాలన్న వ్యూహంతో ముందుకెళుతున్నారు. రోజుకో పార్లమెంటు నియోజకవర్గంపై సమీక్ష నిర్వహిస్తూ.. ఆ పార్లమెంటు పరిధిలోని కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను కన్ఫామ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. అక్కడ ముగ్గురికి టిక్కెట్లు కన్ఫామ్ చేసినట్టు తెలుస్తోంది. మార్కాపురం నుంచి మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి మళ్ళీ అవకాశం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త బివిఆర్ మోహన్ రెడ్డి తమ్ముడు అశోక్ రెడ్డి మార్కాపురం టిక్కెట్ ఆశించినా ఫలితం దక్కలేదు. ఆయనతోపాటు ఇమ్మడి కాశీనాధ్, నారాయణరెడ్డి తోడల్లుడు దుగ్గిరెడ్డి వెంకట కృష్ణారెడ్డి టిక్కెట్ ఆశించినా.. చంద్రబాబు నారాయణరెడ్డి వైపే మొగ్గుచూపారు.

గిద్దలూరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డికి అవకాశం దక్కనుంది. అయితే పోటీకి అశోక్ రెడ్డి సిద్ధంగా లేరన్న వాదన వినబడుతోంది. దీంతో మాజీ ఎమ్మెల్యే పిడతల సాయికల్పనారెడ్డి అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఇక కనిగిరి నుంచి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డికి ఈసారి టిక్కెట్ దక్కే అవకాశం కనిపిస్తోంది. రేపో మాపో ఆయన టీడీపీలో చేరే అవకాశాలున్నాయి. అయితే ఉగ్రకు టిక్కెట్ ఇవ్వడాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబురావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేత ఆయన రెకమెండిషన్ చేయించుకుంటున్నట్టు తెలుస్తోంది. దర్శి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి శిద్దా రాఘవరావు పోటీ చేయనున్నారు. ఆయన కాదంటే ఆయన కుమారుడు శిద్దా సుధీర్ పోటీ చేసే అవకాశముంది.

యర్రగొండపాలెం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజుకు టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నా.. ఆయన సంతనూతలపాడు నుంచి పోటీ చేస్తానని చెబుతున్నట్టు తెలుస్తోంది. దీంతో మరోసారి ఇక్కడ బూదాల అజితారావు పోటీచేయనున్నట్టు సమాచారం. ఇక కొండెపి నుంచి ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు టిక్కెట్ ఆశిస్తునారు. ఆయనకు అధిష్టానం అండదండలు బాగానే ఉన్నా.. కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్.. సిట్టింగ్ ఎమ్మెల్యే డోలా బలవీరాంజనేయ స్వామికి మద్దతు పలుకుతున్నారు. ఇక ఒంగోలు పార్లమెంటుకు కేంద్రభిందువైన ఒంగోలులో సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కే మళ్ళీ అవకాశం దక్కేలా ఉంది. అయితే మాజీ ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు ఈదర హరిబాబు, మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు సైతం ఒంగోలు టికెట్ ఆశిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories