అస్తవ్యస్తంగా వాటర్ ఫౌంటెన్ లు పట్టించుకోని మునిసిపల్ అధికారులు

అస్తవ్యస్తంగా వాటర్ ఫౌంటెన్ లు పట్టించుకోని మునిసిపల్ అధికారులు
x
నెహ్రూచౌక్, కోగంటి రాజ బాపయ్య చౌక్, మూడేళ్ల రామారావు చౌక్ లలో ఉన్న నీటి ఫౌంటెన్ లు
Highlights

స్థానిక నెహ్రూచౌక్, కోగంటి రాజ బాపయ్య చౌక్, మూడేళ్ల రామారావు చౌక్ లలో ఉన్న పచ్చని చెట్లను తొలగించి 25 లక్షలతో నిర్మించిన నీటి ఫౌంటెన్ లు అధ్వానంగా తయారయ్యాయి.

గుడివాడ: స్థానిక నెహ్రూచౌక్, కోగంటి రాజ బాపయ్య చౌక్, మూడేళ్ల రామారావు చౌక్ లలో ఉన్న పచ్చని చెట్లను తొలగించి 25 లక్షలతో నిర్మించిన నీటి ఫౌంటెన్ లు అధ్వానంగా తయారయ్యాయని భవిష్యత్ భద్రతాదళం వ్యవస్థాపకులు వైవి. మురళీకృష్ణ పేర్కొన్నారు. గుడివాడలో సాయంత్రం పట్టణంలోని ఫౌంటెన్లను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫౌంటెన్ లాలో నీరు నిల్వ ఉండడంతో అవి నాచు పట్టి దుర్గంధం వెదజల్లుతోందని, ఫౌంటెన్ లు కూడా పని చేయడం లేదన్నారు. లైట్లు కూడా వెలగడం లేదన్నారు. నీరు నిల్వ ఉండటం వలన దోమలకు నిలయంగా మారాయన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు నిద్రావస్తాను మేల్కొని ఈ మూడు ట్రాఫిక్ ఐలాండ్స్ లోని నీటి ఫౌంటెన్ లను శుభ్రపరిచి ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేలా చూడాలని వైవి మురళీకృష్ణ కోరారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories