Kadiri: నేటి నుండి మీ సేవ కేంద్రాల మూసివేత

Kadiri: నేటి నుండి మీ సేవ కేంద్రాల మూసివేత
x
Mee Seva service center
Highlights

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది.

కదిరి: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. ప్రధాన ఆలయాల దర్శనాలు నిలిపివేసింది. నిత్యం జనాలలో కిక్కిరిసి ఉండే మీసేవ, కేంద్రాలను మూసి వేయనున్నట్లు మీసేవ సంయుక్త సంచాలకుడి నుండి నిర్వాహకులకు ఆదేశాలు అందినట్లు పేర్కొన్నారు. నేటి నుండి మీ సేవ కేంద్రాలు మూతపడనున్నాయి. బ్యాంకుల లోని ఆధార్ కేంద్రాలు కూడా మూసివేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్లు మీ సేవ కేంద్రాల నిర్వాహకులు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. ప్రభుత్వం తదుపరి అనుమతి ఇచ్చే వరకు కేంద్రాలను మూసి వేస్తున్నట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories