అనంతలో తెలుగుతమ్ముళ్ల మధ్య రచ్చకెక్కిన విబేధాలు

అనంతలో తెలుగుతమ్ముళ్ల మధ్య రచ్చకెక్కిన విబేధాలు
x
Highlights

అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల మధ్య విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల ఒకరి వర్గంపై మరొకరు తీవ్ర విమర్శలు...

అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల మధ్య విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల ఒకరి వర్గంపై మరొకరు తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఉమా మహేశ్వర నాయుడు తన సొంత కార్యాలయంలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. పరిశీలకుడుగా బీటీ నాయుడు హాజరయ్యారు. మొదటగా ఉమా మహేశ్వర నాయుడు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఆ తరువాత మాజీ ఎమ్మెల్యే ఉన్నం నిర్వహించిన సమావేశంలోను పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉన్నం హనుమంతరాయ చౌదరి వర్గీయులు బీటీ నాయుడును చుట్టుముట్టి వాగ్వివాదానికి దిగారు.

పార్టీ అధిష్టానం ఇన్‌చార్జ్‌ను నియమించకపోయినా ఉమా మహేశ్వర నాయుడు ఇన్‌చార్జ్‌గా ప్రచారం చేసుకుంటున్నారని ప్రశ్నించారు. దీంతో ఉమా మహేశ్వర నాయుడు వర్గీయులు ప్రతి విమర్శలకు దిగారు. దీంతో పరిస్థితి కాసేపు ఉద్రిక్తంగా మారింది. పరిశీలకుడు బీటీ నాయుడు ఇరువర్గాలకు సర్ది చెప్పారు. దీనిపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయినట్టు సమాచారం. త్వరలో ఇరువర్గాలను విజయవాడ రావలసిందిగా ఆదేశించినట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories