వ్యక్తి ప్రాణం తీసిన రెండు రూపాయల వివాదం..

వ్యక్తి ప్రాణం తీసిన రెండు రూపాయల వివాదం..
x
Highlights

రెండు రూపాయల విషయంలో తలెత్తిన వివాదం ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తూర్పుగోదావరి జిల్లా వలసపాకలలో ఈ దారుణం చోటు చేసుకుంది. వలసపాకల జంక్షన్...

రెండు రూపాయల విషయంలో తలెత్తిన వివాదం ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తూర్పుగోదావరి జిల్లా వలసపాకలలో ఈ దారుణం చోటు చేసుకుంది. వలసపాకల జంక్షన్ లో సాంబ అనే వ్యక్తి పంక్చర్ షాపు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో సైకిల్‌కు గాలి కొట్టించుకునేందుకు సువర్ణరాజు అనే వ్యక్తి పక్కనే ఉన్న ఆ సైకిల్‌షాప్‌కు వెళ్లాడు.. గాలికొట్టించుకున్న తర్వాత డబ్బులు ఇవ్వాలని సాంబ కోరడంతో.. ఇప్పుడు లేవు తరువాత ఇస్తానని సమాధానం ఇచ్చాడు. దాంతో కుదరదు ఇప్పుడే ఇవ్వాలని సాంబ కోరడంతో వివాదం తలెత్తింది.

ఈ సమయంలోనే సాంబ స్నేహితుడు అప్పారావు రావడంతో వివాదం మరింత ముదిరింది. దీంతో ఇద్దరు కలిసి సువర్ణరాజుపై దాడి చేశారు. అప్పారావు.. సువర్ణరాజుపై కత్తితో దాడిచేశాడు.. విచక్షణా రహితంగా పొడవంతో తీవ్ర గాయాలపాలైన సువర్ణరాజు అక్కడికక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు.. స్థానికులు గమనించి అతన్ని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సువర్ణరాజు మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories