వైసీపీలో భగ్గుమన్న విభేదాలు.. వెంకటరెడ్డిపై.. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనుచరులు దాడి

వైసీపీలో భగ్గుమన్న విభేదాలు.. వెంకటరెడ్డిపై.. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనుచరులు దాడి
x
Highlights

వైసీపీలో భగ్గుమన్న విభేదాలు.. వెంకటరెడ్డిపై.. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనుచరులు దాడి

నందికొట్కూరు వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీలోని రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ప్రాతకోట వెంకటరెడ్డిపై బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన నందికొట్కూరు జీవన జ్యోతి స్కూల్ వద్ద కాపుకాసి దాడి చేసినట్టు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన వెంకటరెడ్డిని ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనకు కారణం ప్రాతకోట విద్యాకమిటీ ఎన్నికల్లో తలెత్తిన వివాదం అని తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్నఎమ్మెల్యే ఆర్థర్ ఆసుపత్రికి వెళ్లారు. ఈ విషయంపై నంద్యాల వైసీపీ పార్లమెంటు అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి సీరియస్ అయ్యారు. ఘటనపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు గ్రామంలో గొడవలు చెలరేగడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. రెండు వర్గాలను పిలిచి మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories