సీకే బాబు ప్రయత్నం ఈసారైనా ఫలిస్తుందా!

సీకే బాబు ప్రయత్నం ఈసారైనా ఫలిస్తుందా!
x
Highlights

చిత్తూరు జిల్లాలో టైగర్ గా పేరొందిన మాస్ లీడర్ ఆయన, సీకే జయచంద్రారెడ్డి అంటే అందరికి తెలియకపోవచ్చు. కానీ సీకే బాబు అంటే మాత్రం పరిచయం అక్కర్లేదు....

చిత్తూరు జిల్లాలో టైగర్ గా పేరొందిన మాస్ లీడర్ ఆయన, సీకే జయచంద్రారెడ్డి అంటే అందరికి తెలియకపోవచ్చు. కానీ సీకే బాబు అంటే మాత్రం పరిచయం అక్కర్లేదు. అటువంటి ల్యాండ్ మార్క్ ఆయన సొంతం. ప్రస్తుతం ఆయన రాజకీయ భవితవ్యం అంధకారంలో పడింది. మున్సిపల్ కౌన్సిలర్ గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి.. రాష్ట్ర నేతగా ఎదిగారు. కానీ కాలం కలిసిరాక ప్రస్తుతం రాజకీయ నిరుద్యోగిగా మారారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికున్న సమయంలో ఓ వెలుగు వెలిగిన సీకే.. ప్రస్తుతం అయోమయంలో పడ్డారు. కాంగ్రెస్, వైసీపీ నుంచి బీజేపీలోకి అటునుంచి టీడీపీలోకి మళ్ళీ ఇప్పుడు వైసీపీలోకి రావడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారట.. మొదట కాంగ్రెస్ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు..

1989 , 94 ,99 ఎన్నికల్లో వరుసగా చిత్తూరు ఎమ్మెల్యేగా విజయం సాధించి.. ఆ తరువాత 2009 లో కూడా గెలిచి మంత్రి పదవి రేసులో ఉన్నారు. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి పదవి దక్కింది.. కానీ ఆయనకు అమాత్య ముచ్చట తీరలేదు. దాంతో వైఎస్ నే నమ్ముకున్నారు. దురదృష్టవాత్తు వైఎస్ అకాల మరణం చెందారు. ఆ తరువాత జగన్ స్థాపించిన వైసీపీలో చేరమని ఒత్తిడి వచ్చినా కిరణ్ కుమార్ రెడ్డి వెంటే నడిచారు. 2014 ఎన్నికలకు కాంగ్రెస్ పుంజుకోకపోవడంతో చేసేదేమి లేక వైసీపీలో చేరారు.

అక్కడ సీటు దక్కలేదు. పైగా 2014 లో వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో మళ్ళీ ఆలోచనలో పడ్డారు సీకే. వైసీపీలో సీటు హామీ రాకపోవడంతో బీజేపీలో చేరారు.. అయినా 2019 ఎన్నికలకు ముందు వైసీపీ టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డుకున్నారన్న కారణంతో ఆయనకు మరోసారి నిరాశే ఎదురైంది. దాంతో ఎలాగైనా వైసీపీ అభ్యర్థిని ఓడించాలనే కసితో సతీమణితో సహా టీడీపీలో చేరారు.. కానీ అక్కడ కూడా సీకే కు నిరాశే మిగిలింది. టీడీపీ టిక్కెట్ దక్కలేదు.. దాంతో సత్యవేడు, చిత్తూరు నియోజకవర్గాల అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహించినా.. వైసీపీ హవాలో నిలవలేదు.

ఆయన ప్రచారం చేసిన రెండు నియోజకవర్గాలు ఘోరంగా ఓడాయి.. అధికారంలోకి రావడంతో సీకే మళ్ళీ వైసీపీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కానీ ఆయన చేరికకు మాత్రం వైసీపీ పచ్చజెండా ఊపలేదు. దీనికి కారణం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డే అని ఆయన అనుచరులు అభిప్రాయపడుతున్నారట. ఇదంతా ఎందుకు డైరెక్ట్ గా జగన్ తోనే తేల్చుకోవాలని సీకే అనుకుంటున్నారట.. త్వరలో సీఎం జగన్ అపాయింట్మెంట్ తీసుకొని వైసీపీలో చేరాలని అనుకుంటున్నారట. ఈసారైనా ఆయన ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories