నేటితో ముగియనున్న జస్టిస్‌ గొగొయ్ పదవీకాలం.. చివరి రోజు శ్రీవారి సేవలో

నేటితో ముగియనున్న జస్టిస్‌ గొగొయ్ పదవీకాలం.. చివరి రోజు శ్రీవారి సేవలో
x
Highlights

తిరుమల ఆలయం సమీపంలో జరిగిన 'సహస్ర దీపాలంకరన సేవలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పాల్గొన్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌లో కుటుంబసభ్యులతో కలిసి...

తిరుమల ఆలయం సమీపంలో జరిగిన 'సహస్ర దీపాలంకరన సేవలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పాల్గొన్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌లో కుటుంబసభ్యులతో కలిసి స్వామిని దర్శించి, మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబసమేతంగా మహాద్వారం వద్దకు చేరుకున్న జస్టిస్ గొగొయ్‌కు టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. టిటిడి వర్గాల సమాచారం ప్రకారం, జస్టిస్ రంజన్ గొగోయ్ ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు శనివారం మధ్యాహ్నం జస్టిస్ రంజన్ గొగోయ్ తన భార్య రూపంజలి గొగోయ్తో కలిసి తిరుచానూరు పద్మావతి దేవిని పూజించారు. ఆలయ ప్రవేశద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు ఆలయ పూజారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.

జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పి బసంత్ కుమార్ నేతృత్వంలోని టిటిడి అధికారులు కూడా ఆయన వెంట ఉన్నారు. భారత న్యాయవ్యవస్థలో విశిష్టమైన కెరీర్ తర్వాత సిజెఐ రంజన్ గొగోయ్ ఆదివారం (నవంబర్ 17) పదవీవిరమణ చేయనున్నారు. 130 ఏళ్లకు పైగా నలుగుతున్న అయోధ్య వివాదాన్ని పరిష్కరించారు. వివాదాస్పద భూమి హిందువులకు చెందుతుందని, మసీదు కోసం ఐదెకరాల స్థలం కేటాయించాలని తీర్పులో వెల్లడించారు. అలాగే, చీఫ్ జస్టిస్ కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి వస్తుందని ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్ధించారు. శబరిమలలోకి మహిళల ప్రవేశం, రఫేల్ ఒప్పందాలపై తీర్పును వెలువరించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories