ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌: మాజీ మంత్రులపై కేసు నమోదు.. భూములు లాక్కున్నారంటూ!

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌: మాజీ మంత్రులపై కేసు నమోదు.. భూములు లాక్కున్నారంటూ!
x
Highlights

రాజధానిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ పై సీఐడీ దూకుడు పెంచింది. తెల్లరేషన్ కార్డుదారులు కొనుగోలు చేసిన భూముల వివరాలను సీఐడీ సేకరించింది. మంగళగిరి, తుళ్లూరు,...

రాజధానిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ పై సీఐడీ దూకుడు పెంచింది. తెల్లరేషన్ కార్డుదారులు కొనుగోలు చేసిన భూముల వివరాలను సీఐడీ సేకరించింది. మంగళగిరి, తుళ్లూరు, రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి వివరాలు సేకరించిన సీఐడీ 797 మంది తెల్లరేషన్ కార్డుదారులు 761 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. తుళ్లూరు, తాడికొండ, పెదకాకాని, తాడేపల్లి, మంగళగిరి, అమరావతి ఏరియాల్లో భూములు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అధికంగా తుళ్లూరులో 245 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో తెల్లరేషన్ కార్డుదారులపై చీటింగ్ , బినామీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. కోట్లాది రూపాయల లావాదేవీలు జరిపి ఇన్ కమ్ ట్యాక్స్ కట్టలేదని సీఐడీ అధికారులు గుర్తించారు.

ఇదిలా ఉండగా మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణతో పాటు మరి కొంత మందిపై వెంకటపాలెంకు చెందిన బుజ్జమ్మ అనే మహిళ సీఐడీకి ఫిర్యాదు చేసింది. తనకు సంబంధించిన 99 సెంట్ల అసైన్డ్‌ భూమిని బెదిరించి కొనుగోలు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొంది. మాజీ మంత్రులు పొంగూరు నారాయణ, పత్తిపాటి పుల్లారావు సహా స్థానిక టీడీపీ నేత, వెంకటాయపాలెం మాజీ సర్పంచ్‌ బెల్లంకొండ నరసింహాపై కేసులు నమోదు చేసినట్లు సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. వెంకటాయపాలెంకు చెందిన పోతురాజు బుజ్జమ్మ అనే మహిళను బెదిరించి తన 99సెంట్ల భూమిని కొనుగోలు చేశారని సదరు మహిళా ఫిర్యాదు చేయడంతో వారిపై సెక్షన్‌ 420, 506,120(బి) కేసులను నమోదు చేసి విచారణ చేపట్టామని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories