Andhra Pradesh: మాజీ మంత్రి దేవినేని ఉమకు సీఐడీ నోటీసులు

Devineni Uma Arrest
x

దేవినేని ఫైల్ ఫోటో

Highlights

Andhra Pradesh: ఇవాళ కర్నూలు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.

Andhra Pradesh: మాజీ మంత్రి దేవినేని ఉమకు సీఐడీ నోటీసులు జారీ చేశారు. సీఎం జగన్ మాటలను వక్రీకరించారని న్యాయవాది ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఇవాళ ఉదయం కర్నూలు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని గొల్లపూడిలోని ఆయన నివాసంలో నోటీసులు అందించారు.. ఈ నెల 7న దేవినేని ఉమా మీడియా సమావేశం నిర్వహించారు.. అందులో మార్ఫింగ్ చేసిన జగన్ వీడియోలు ప్రదర్శించారని అభియోగం మోపారు.. ఈ మేరకు 464, 465, 468, 469, 470, 471, 505, 120 బి సెక్షన్ల కింద ఉమాపై సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రెస్‌మీట్‌లో ప్రదర్శించిన వీడియోలు కూడా తీసుకురావాలని నోటీసులో పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories