సీఎం జగన్ ప్రతిపాదన ప్రశంసనీయం : రెడ్డమ్మ

సీఎం జగన్ ప్రతిపాదన ప్రశంసనీయం : రెడ్డమ్మ
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులను ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదన ఎంతో ప్రశంసనీయమని చిత్తూరు జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్...

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులను ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదన ఎంతో ప్రశంసనీయమని చిత్తూరు జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (డిసిసిబి) చైర్‌పర్సన్ ఎం. రెడ్డమ్మ అన్నారు. రాజకీయ మైలేజ్ పొందడానికి, తన పార్టీ వారికి ప్రయోజనాల కోసం ఈ ప్రతిపాదనను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తున్నారని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైఎస్‌ఆర్‌సిపి నాయకులు చిత్తూరులోని వివిధ ప్రదేశాలలో ఉచిత భోజనం, రక్తదాన శిబిరాలు, రోగులకు పండ్లు పంపిణీ వంటి అనేక కార్యక్రమాలను నిర్వహించారు. కొంగారెడ్డిపల్లిలో జరిగిన కేక్ కటింగ్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన రెడ్డమ్మ..

కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వంతో పొత్తు పెట్టుకున్నప్పటికీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక కేటగిరీ హోదాను తీసుకురావడంలో విఫలమయ్యారని అన్నారు. రైతుల సంక్షేమం కోసం డిసిసిబి మొదటి నుంచీ కట్టుబడి ఉందని, జిల్లాలో కరువు పీడిత మండలాలకు సంబంధించిన రైతుల పంట రుణాలను తిరిగి రీ షెడ్యూల్ చెయ్యాలని సూచనలు ఇచ్చామని ఆమె చెప్పారు. చిత్తూరు ఎమ్మెల్యే ఎ శ్రీనివాసులు, వైయస్ఆర్సిపి నాయకులు కృష్ణారెడ్డి, కృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories