Top
logo

సీఎం జగన్ ను కలవనున్న హీరో చిరంజీవి.. అపాయింట్మెంట్ ఖరారు

సీఎం జగన్ ను కలవనున్న హీరో చిరంజీవి.. అపాయింట్మెంట్ ఖరారు
Highlights

సీఎం జగన్ ను కలవనున్న హీరో చిరంజీవి.. అపాయింట్మెంట్ ఖరారు

ఆంధ్రప్రదేశ్ కు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత టాలీవుడ్ ప్రముఖులెవరు జగన్‌ని కలిసింది లేదు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. సినీనటుడు, svbc చైర్మన్ పృథ్విరాజ్ ఈ విషయంలో సినీ పెద్దలను తీవ్రంగా ఆక్షేపించారు. ఇవి పక్కనపెడితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి జగన్ ని కలవటానికి అపాయింట్ మెంట్ కోరారు. దీంతో రేపు (శుక్రవారం) ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అపాయింట్మెంట్ ఖరారైనట్టు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు హీరో రాంచరణ్ లు సీఎంతో సమావేశం కానున్నారు.

ఈ సందర్బంగా సీఎంను సైరా సినిమా చూడమని కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ గవర్నర్ సౌందరరాజన్ ఫ్యామిలీకి సైరా స్పెషల్ షో వేసి చూపించారు చిరంజీవి. గతంలో ఓ శుభకార్యంలో జగన్, చిరంజీవి కలిశారు.. ఆ తరువాత వీరిద్దరూ సమావేశం కావడం ఇదే. ఇదిలావుంటే భారతదేశపు తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన వచ్చిన 'సైరా' సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో మెగాస్టార్ చిరంజీవి నటనకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు.

Next Story

లైవ్ టీవి


Share it