అది ఫేక్ ప్రకటన నాకు ఎలాంటి సంబంధం లేదు: చిరంజీవి

అది ఫేక్ ప్రకటన నాకు ఎలాంటి సంబంధం లేదు: చిరంజీవి
x
మెగాస్టార్ చిరంజీవి
Highlights

మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసినట్లుగా ఓ ఫేక్ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసినట్లుగా ఓ ఫేక్ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫేక్ ప్రకటనపై చిరంజీవి వివరణ ఇచ్చారు. మూడు రాజధానులను సమర్థించినట్లుగా శనివారం విడుదల చేసిన ప్రకటన మాత్రమే వాస్తవమని, ప్రస్తుతం సోషల్ మీడియాలో తిరుగుతున్న ప్రకటనతో తనకెలాంటి సంబంధం లేదని.. అది అవాస్తవమని తెలియజేశారు. అంతేకాదు మూడు రాజధానుల జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లుగా ఆయన మరోసారి స్పష్టం చేశారు.

కాగా ఈ ఫేక్ ప్రకటనలో

'యావత్ ఆంధ్ర ప్రజానీకానికి సవినయంగా తెలియజేయునది.. ప్రస్తుతం నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల ఏర్పాటుని సమర్థిస్తూ గానీ, వ్యతిరేకిస్తూ గానీ నేను ఏవిధమైన ప్రకటన చేయలేదు. తెలుగు ప్రజలకు చేరువచేసి, నన్నింతవాణ్ణి చేసిన సినిమా రంగం మీదే నాదృష్టి ఉంది. దయచేసి గమనించగలరు..' అంటూ ప్రచారం చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories