టీడీపీలో చేరేందుకు సిద్దమైన వైసీపీ ఇంచార్జ్

టీడీపీలో చేరేందుకు సిద్దమైన వైసీపీ ఇంచార్జ్
x
Highlights

ఏపీలో రాజకీయం వేడెక్కింది. టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులనే టార్గెట్ గా పెట్టుకుంది వైసీపీ. అందులో భాగంగా ఇప్పటికి చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్...

ఏపీలో రాజకీయం వేడెక్కింది. టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులనే టార్గెట్ గా పెట్టుకుంది వైసీపీ. అందులో భాగంగా ఇప్పటికి చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యారు, మంచి రోజు చూసుకుని ఆ పార్టీ కండువా కప్పుకునేందుకు రెడీగా ఉన్నారు, అలాగే అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు, అమలాపురం ఎంపీ రవీంద్రబాబును వైసీపీలో చేరిపోయారు. అయితే కొన్నిచోట్ల టీడీపీ నేతలపై అభ్యంతరం చెప్పని వైసీపీ నాయకులు.. చీరాలలో మాత్రం తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు.

చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరితే తాను టీడీపీలో చేరుతానని వైసీపీ ఇంచార్జ్ యడం బాలాజీ చెప్పిన మాటను నిజం చేసేలా వ్యవహరిస్తున్నారు. సోమవారం సాయంత్రం టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిశారు. ఈ సందర్బంగా పార్టీలో చేరికపై చంద్రబాబుతో చర్చించారు. నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో చర్చించి నిర్ణయం చెబుతానని చంద్రబాబు బాలాజీతో చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు చీరాలకు వైసీపీకి బలమైన నేత వచ్చాడన్న సంతోషం,, యడం బాలాజీ రూపంలో నిలువలేకుండా పోయింది. బాలాజీ టీడీపీలో చేరడానికి దాదాపుగా సిద్ధమైనట్టుగా ప్రచారం జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories