టీడీపీకి మరో షాక్‌.. పార్టీ వీడుతున్న మరో ఎమ్మెల్యే?

టీడీపీకి మరో షాక్‌.. పార్టీ వీడుతున్న మరో ఎమ్మెల్యే?
x
Highlights

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు టీడీపీ నెత్తిమీదకు తెచ్చాయి. ఈ ఎన్నికల్లో కనీసం అభ్యర్థులను కూడా నిలపలేని పరిస్థితి టీడీపీకి ఏర్పడింది. గతంలో...

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు టీడీపీ నెత్తిమీదకు తెచ్చాయి. ఈ ఎన్నికల్లో కనీసం అభ్యర్థులను కూడా నిలపలేని పరిస్థితి టీడీపీకి ఏర్పడింది. గతంలో పదవులు అనుభవించి అధికారం కోల్పోయాక మొహం చాటేస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు.. ఇప్పటికే చాలా జిల్లాల్లో కీలక నేతలుగా గుర్తింపు పొందిన నేతలు, కరుడుగట్టిన టీడీపీ వాదులు బాబును కాదని జగన్ చెంతకు చేరుతున్నారు. ప్రకాశం జిల్లాలో ఆ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న కరణం బలరాం కృష్ణమూర్తి టీడీపీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

ఇవాళ లేదా రేపు ఆయన వైసీపీలో చేరనున్నట్టు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లలో ఆయన ఎక్కడా పాల్గొనలేదు కదా.. కనీసం ఆయన వర్గానికి సంబంధించిన అభ్యర్థులను కూడా నిలపలేదు. దీనికి కారణం వైసీపీలో చేరడమే అని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. ఆయన టీడీపీని వీడతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో వీటిని బలరాం కానీ.. ఆయన వర్గం కానీ ఖండించలేదు.. దాంతో బలరాం వైసీపీలో చేరడం దాదాపు ఖాయమైనట్టే అని తెలుస్తోంది.

అయితే ఆయన పార్టీ కండువా కప్పుకోకుండా వైసీపీకి మద్దతు మాత్రమే తెలపాలని అనుకుంటున్నట్టు సమాచారం. పార్టీ కండువా కప్పుకుంటే పార్టీ మారినట్టు ఎవిడెన్స్ దొరుకుతుంది కాబట్టి టీడీపీ స్పీకర్ కు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఈ కారణంతోనే బలరాం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఎన్నికల తరువాత టీడీపీ అధిష్టానం వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్న బలరాం వైసీపీలో చేరడానికి చాలా సార్లు ప్రయత్నించారు.. కానీ ఆమంచి కృష్ణమోహన్ అడ్డుచెప్పడంతో చేరిక కుదరలేదు.

కాగా టీడీపీలోనే ఉన్న అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కారణంగా బలరాం అసంతృప్తిగా ఉన్నారన్నది బహిరంగ రహస్యమే. వీరిద్దరికి చాలా ఏళ్లుగా రాజకీయ గొడవలు ఉన్నాయి. 2014 లో వైసీపీ నుంచి గెలిచిన గొట్టిపాటి రవికుమార్ పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారు. ఆయన చేరికకు కరణం బలరాం తీవ్రంగా అడ్డు చెప్పారు. అప్పటినుంచి మొదలైన అసంతృప్తి ఇప్పుడు బలరాం పార్టీ మారేలా చేసిందని అంటుంటారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories