మా నాన్న చావుకు కరోనా కారణం కాదంటూ ఫ్లెక్సీ

మా నాన్న చావుకు కరోనా కారణం కాదంటూ ఫ్లెక్సీ
x
Highlights

ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తున్న క‌రోనా భార‌త దేశంలోనూ వేగంగా వ్యాపించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మ‌హ‌మ్మ‌రి గురించి తెలియ‌గానే ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి.

ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తున్న క‌రోనా భార‌త దేశంలోనూ వేగంగా వ్యాపించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మ‌హ‌మ్మ‌రి గురించి తెలియ‌గానే ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. క‌రోనా మ‌హమ్మ‌రి ప్ర‌జ‌లను భ‌యభ్రంతుల‌కు గురిచేస్తుంది. కాస్త జ‌లుబు చేసిందంటే చాలు క‌రోనా వ్యాపించింది వ‌చ్చిందేమో అనుకునేంత వ‌ర‌కూ మ‌నిషి ఆలోచ‌న‌లు తీసుకెళ్తుంది. ప్ర‌భుత్వాలు, ప‌లువురు ప్ర‌ముఖులు ప్ర‌జ‌ల‌కు ఈ మ‌హమ్మారి సోక‌కుండా ఉండేందుకు జాగ్ర‌త్త‌లు చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల్లో చైత‌న్యం మాట అటూంచితే. ప్ర‌తిక్షణం మాధ్య‌మాల్లో , సామాజిక మాద్య‌మాల్లో ఈ మ‌హమ్మారి గురించి వింటున్న ప్ర‌జ‌లు మ‌రింత భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు.

ఈ వైరస్ రాకుండా ఉండాల‌ని ఇత‌ర గ్రామవాసులు త‌మ ఊరికి రాకుండా ఉండాల‌ని కంచెలు ఏర్పాటు చేశారు. అంతే కాదు కంచెను ప‌క్క గ్రామం వారు తొలిగించార‌ని రాళ్ల దాడులు చేసుకున్నారు. అది దేని గురించైతే భ‌య‌ప‌డి ప్ర‌జ‌లు భ‌య‌ప‌డి కంచెలు వేసుకున్నారో ఆ వైర‌స్ కార‌ణంగా.. గుంపులుగా ఉంటే ఈ మ‌హ‌మ్మారి సోకుతుంద‌నే ఆలోచ‌న లేకుండానే దాడులు చేసుకున్నారు. ఇదిలా ఇలా ఉంటే ఇటీవ‌లే క‌ర‌నా సోకింద‌నే కార‌ణంతో ఇద్ద‌రు దంప‌తులు ఉరి వేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న మ‌నం విన్నాం. ఈ మ‌హ‌మ్మారి మ‌న‌షుల మ‌న‌సుల్లో ఎంత ప్ర‌భావం చూపిందో అర్థం చేసుకోగ‌లం.

ప్ర‌భుత్వాలు, వైద్యులు, ఎంత చైత‌న్య‌ప‌రుస్తున్న రోజురోజుకు ఈ మ‌హమ్మారిపై అపోహ‌లు పెరిగిపోతున్నాయి. ఏదేమైనా క‌రోనా బాధితులు కాక‌పోయినా క‌రోనా వచ్చింది అనే భ‌యం ఎంతో మంది మాన‌సిక‌వేద‌న‌కు గురిచేస్తుంది. తాజాగా ప్ర‌కాశం జిల్లా చీరాల‌కు చెందిన వ్య‌క్తి త‌న తండ్రి మృతికి క‌రోనా కాదు అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు.

వివ‌రాల్లో వెళ్తే.. చీరాల‌ నగరంలో నవాబ్ పేటకు చెందిన స్వీట్ షాప్ వ్యాపారి షేక్ మునీర్ అనారోగ్యంతో మ‌ర‌ణించాడు. మునీర్ భాయిగా ఆ చూట్టుప్రాంతాల్లో సుప‌రిచితుడు. అయితే మునీర్ గ‌త కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధీతో బాధ‌ప‌డుతున్నాడు. అయితే వారం రోజుల క్రితం మనీర్ ఆరోగ్యం క్షీణించ‌డంతో ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఆస్ప‌త్రిలోనే చికిత్స పొందుతూ మునీర్ ప్రాణం విడిచారు.

అయితే మునీర్ కరోనా వ‌ల‌నే చ‌నిపోయాడ‌ని అంద‌రూ భావించారు. దీంతో చీరాల ప్ర‌జ‌లు, న‌వాబ్ పేటలోని మునీర్ ఇంటి చుట్టుప‌క్క‌ల అంద‌రూ క‌రోనా వ‌ల్లే త‌నువు చాలించాడ‌ని అపోహ ప‌డ్డారు. మునీర్ ఇంటి వైపు వెళ్తే క‌రోనా సోకుతుందేమో అనే భ‌యంతో ఉన్నారు. అయితే షేక్ కరోనా వైర‌స్ వైద్య పరీక్షలు నిర్వహిస్తే నెగిటివ్ రిపోర్టు వచ్చింది. దీనీనీ మునీర్ కొడుకు శ్ర‌ద్ధాంజ‌లి ఫ్లెక్సీలో ప్ర‌స్తావించారు. త‌న తండ్రి మునీర్ క‌రోనా వ‌లన మ‌ర‌ణించ‌లేద‌ని, డ‌యాల‌సీస్ వ్యాధీతో చ‌నిపోయార‌ని చెప్తు బ్యాన‌ర్ క‌ట్టాడు.

దానిలో క‌రోనా నెగిటివ్ రిపోర్టులు పొందుప‌రిచాడు. కరోనా విల‌య‌తాండ‌వం కారణంగా ఎవరూ అపోహ చెందకుడ‌ద‌నే ప్లెక్సీలో రాయాల్సి వచ్చిందని మునీర్ తనయుడు చెప్పుకొచ్చాడు. దీంతో క‌రోనాపై ప్ర‌జ‌ల్లో అపోహ‌లు తొల‌గించేందుకు మునీర్ కొడుకు చేసిన ప‌నికి ప‌లువురు అభినందిస్తున్నారు. క‌రోనా వైర‌స్ ప్రాణాలు తీసేంత మ‌హమ్మ‌రి కాదని, అది సోక‌కుండా ఉండాలంటే ప‌లు సూచ‌న‌లు పాటించాల‌ని ప్ర‌భుత్వాలు చెబుతున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories