నేడు సీఎంతో ఆమంచి భేటీ.. రంగంలోకి దిగిన బొత్స, దగ్గుబాటి..

నేడు సీఎంతో ఆమంచి భేటీ.. రంగంలోకి దిగిన బొత్స, దగ్గుబాటి..
x
Highlights

ప్రకాశం జిల్లా చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్‌ కొంతకాలంగా టీడీపీ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. 2014 లో చీరాల నుంచి పోటీ చేసిన...

ప్రకాశం జిల్లా చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్‌ కొంతకాలంగా టీడీపీ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. 2014 లో చీరాల నుంచి పోటీ చేసిన పోతుల సునీత వర్గానికి రెండు పదవులు ఇవ్వడం, అలాగే పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గుతోందనే కారణాలతో అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలో కొందరు కార్యకర్తలు పార్టీ మారాలని సూచన చేశారు. దాంతో మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, దగ్గుబాటి వెంకటేశ్వరావు లు ఆమంచిని వైసీపీలో చేరాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది.

ఆమంచి కూడా దాదాపు వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో అప్రమత్తమైన టీడీపీ అధిష్టానం ఆమంచిని బుజ్జగించేందుకు అధిష్టానం దూతగా మంత్రి శిద్దా రాఘవరావును రంగంలోకి దింపింది.. ఒకసారి సీఎంతో మాట్లాడాలని శిద్దా ఆమంచిని కోరడంతో.. గురువారం ఉదయం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును కలవనున్నారు. అయితే సీఎం సూచన మేరకు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు. బుధవారమే సీఎంను కలవాల్సిన ఆమంచి.. సాయంత్రం త్రిమూర్తులు స్వగ్రామమైన వెంకటాయపాలెం వెళ్లి ఆయనతో చర్చించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories