ఆమంచి కృష్ణమోహన్ పార్టీ మార్పు ఖాయమా?

ఆమంచి కృష్ణమోహన్ పార్టీ మార్పు ఖాయమా?
x
Highlights

చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి రాజీనామా చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ ఫ్లెక్సీ వ్యవహారం ఆ పార్టీ కార్యకర్తలను అయోమయానికి...

చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి రాజీనామా చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ ఫ్లెక్సీ వ్యవహారం ఆ పార్టీ కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తోంది. చీరాల రైల్వే స్టేషన్ సమీపంలో కరణం బలరాం ఫోటోతో ప్లెక్సీని ఏర్పాటు చేశారు కొందరు టీడీపీ కార్యకర్తలు. అయితే అందులో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఫోటో లేకుండా ఉండటం చర్చనీయాంస్యమైంది. దీంతో ఆమంచి గనక పార్టీ మారితే చీరాల నుంచి కరణం బలరాం బరిలోకి దిగవచ్చన్న ప్రచారం ఊపందుకుంది. ఆమంచి పార్టీ మార్పు నేపథ్యంలోనే బలరాం ప్లెక్సీని కార్యకర్తలు ఏర్పాటు చేసి ఉంటారని అంటున్నారు చీరాల వాసులు. ఇదిలావుంటే పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని కొంతకాలంగా ఆమంచి కృష్ణమోహన్ అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల సీఎంను కలిసినా టీడీపీలో కొనసాగే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ప్లెక్సీ వ్యవహారం టీడీపీ క్యాడర్ ను అయోమయానికి గురిచేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories