Chinta Mohan: చిరంజీవే మా సీఎం అభ్యర్థి

Chinta Mohan Sensational Comments Chiranjeevi As Congress Cm Candidate
x

Chinta Mohan: చిరంజీవే మా సీఎం అభ్యర్థి

Highlights

Chinta Mohan: కాంగ్రెస్‌ తరఫున తిరుపతి అసెంబ్లీ నుంచి చిరంజీవి పోటీచేస్తే.. 50వేల మెజార్టీతో గెలిపిస్తాం

Chinta Mohan: మాజీ ఎంపీ చింతామోహన్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. రానున్న ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాబోతోందని అన్నారు. 130 అసెంబ్లీ, 20 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ గెలవబోతోందని జోస్యం చెప్పారు చింతామోహన్‌. అలాగే.. కాంగ్రెస్‌ తరఫున తిరుపతి అసెంబ్లీ నుంచి చిరంజీవి పోటీచేస్తే.. 50వేల మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. అంతేకాకుండా చిరంజీవి సీఎం అవ్వడం ఖాయమని ఘంటాపథంగా చెప్పారు. పోటీకి దిగాలా..? వద్దా..? అనేది చిరంజీవే నిర్ణయం తీసుకోవాలని అన్నారు చింతామోహన్‌. కాకినాడ లోక్‌సభ నుంచి సీతారాం ఏచూరి, నగరి అసెంబ్లీ నుంచి నారాయణను పోటీ చేయమని కోరుతున్నానన్నారు చింతామోహన్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories