కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి: చింతా మోహన్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి: చింతా మోహన్
x
చింతా మోహన్
Highlights

సుపరిపాలన అందించడం, నిత్యావసరాల ధరలు నియంత్రించడం వంటి వాటిల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని మాజీ కేంద్ర మంత్రి ఎంపీ చింతా మోహన్ ఆరోపించారు.

సుపరిపాలన అందించడం, నిత్యావసరాల ధరలు నియంత్రించడం వంటి వాటిల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ ఆరోపించారు. తిరుపతిలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలోమాట్లాడిన ఆయన దేశంలో నిత్యావసర వస్తువుల ధరల తీవ్రంగా పెరిగిపోతున్నాయని.. ఇది పాలనా వైఫల్యాన్ని సూచిస్తోందని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ విధానాల వల్ల దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పెరిగిపోతోందని అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇక రాష్ట్రంలో కూడా ఎటువంటి అభివృద్ధి జరగడం లేదని వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని చంపేలా పాలన సాగిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కారణాలతో రాజధాని మార్పు చేయకూడదని సూచించారు. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తే అక్కడ రైతుల నుంచి తీసుకున్న అన్ని వేల ఎకరాలను ఏమి చేస్తారని ప్రశ్నించారు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా 29 గ్రామాల రైతులు చేస్తోన్న ఆందోళనకు ఆయన సంఘీభావం తెలిపారు. కాగా టీటీడీలో స్థానికులకు అన్యాయం జరుగుతోందని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories