పాయకరావుపేటలో బాలల చిత్రోత్సవాలు

పాయకరావుపేటలో బాలల చిత్రోత్సవాలు
x
బాలల చిత్రోత్సవాలు
Highlights

పట్టణంలోని చిత్రమందిర్, శ్రీలక్ష్శీ ధియేటర్లలో వారం రోజుల పాటు ఎగిరే తారాజువ్వలు అనే బాలల చిత్రాన్ని ప్రదర్శిస్తామని రూరల్ ఎడ్యుకేషన్ ప్రతినిధులు తెలిపారు.

పాయకరావుపేట: పట్టణంలోని చిత్రమందిర్, శ్రీలక్ష్శీ ధియేటర్లలో వారం రోజుల పాటు ఎగిరే తారాజువ్వలు అనే బాలల చిత్రాన్ని ప్రదర్శిస్తామని రూరల్ ఎడ్యుకేషన్ అండ్ అగ్రికల్చర్ లేబర్ సొసైటీ ప్రతినిధులు ఎస్.కృష్ణమూర్తి, వెంకటేశ్వర్లు తెలిపారు. నవంబర్ 14 బాలల దినోత్సవం పురస్కరించుకుని సొసైటీ ఆధ్వర్యంలో బాలల చిత్రోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. పిల్లలలో చైతన్యం, తెలివితేటలను పెంపొందించుటకు ఈ సినిమాలు ఉపయోగపడతాయన్నారు.

నవంబర్ 30 నుండి డిశంబర్ 6 వ తేదీ వరకూ ప్రతిరోజూ ఉదయం గం.8 :30 నుండి గం.11 ల వరకు సినిమా ప్రదర్శన జరుగుతుందన్నారు. అన్ని పాఠశాలల యాజమాన్యాలు తమ విద్యార్ధులను పంపించాలని కోరారు. ఈ సినిమాల ప్రదర్శన ద్వారా వచ్చిన లాభాన్ని అనాధ, వికలాంగులు, వృధ్ధ ఆశ్రమాలకు వినియోగిస్తామని కృష్ణమూర్తి, వెంకటేశ్వర్లు తెలిపారు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories