వైసీపీ ఎమ్మెల్యే రజని కాల్ రికార్డును బయటపెట్టి చిక్కుల్లో పడ్డ హెడ్మాస్టర్

వైసీపీ ఎమ్మెల్యే రజని కాల్ రికార్డును బయటపెట్టి చిక్కుల్లో పడ్డ హెడ్మాస్టర్
x
Highlights

చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజని కాల్ రికార్డును బయటపెట్టి ఓ ప్రధానోపాధ్యాయురాలు సస్పెన్షన్ కు గురయ్యారు. చిలకలూరిపేట శారదా హైస్కూల్ విద్యా...

చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజని కాల్ రికార్డును బయటపెట్టి ఓ ప్రధానోపాధ్యాయురాలు సస్పెన్షన్ కు గురయ్యారు. చిలకలూరిపేట శారదా హైస్కూల్ విద్యా కమిటీపై గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది. ప్రస్తుతం ఏర్పడిన విద్యా కమిటీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు వైసీపీ నేతలు. దాంతో ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు ఎమ్మెల్యే రజని.. ప్రధానోపాధ్యాయురాలు ధనలక్ష్మికి ఫోన్ చేసి కమిటీని రద్దు చేయాలని ఆదేశించారామే.

అయితే ఈ విషయాన్ని ప్రస్తుతం కొనసాగుతోన్న విద్యా కమిటీకి ధనలక్ష్మి తెలియజేశారు. అంతేకాకుండా, విద్యా కమిటీని రద్దు చేయాలనీ రజని తనతో మాట్లాడిన వాయిస్ రికార్డును కూడా కమిటీకి వినిపించారు. ఈ విషయం తెలుసుకున్న రజని ప్రధానోపాధ్యాయురాలుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆమెపై విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో ధనలక్ష్మిని అధికారులు సస్పెండ్ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories