ఈరోజు విజయనగరం జిల్లాలో సీఎం జగన్ పర్యటన

X
Highlights
* గుంకలాంలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్న సీఎం * సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు * సీఎం పర్యటించే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత
Sandeep Eggoju30 Dec 2020 2:24 AM GMT
నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా ఇవాళ విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు ఏపీ సీఎం జగన్. గుంకలాంలో సిద్ధం చేసిన ఇళ్ల స్థలాలను పేదలకు పంపిణీ చేయనున్నారు. ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు.
ఉదయం 9 గంటల 30 నిమిషాలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం జగన్.. 11 గంటల 15 నిమిషాలకు గుంకలాం చేరుకుంటారు. అక్కడ పైలాన్ ఆవిష్కరించి అనంతరం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి లబ్ధిదారులతో ముఖాముఖిలో పాల్గొంటారు. ఆ తర్వాత 2 గంటల 45 నిమిషాలకు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌కు చేరుకోనున్నారు సీఎం.
ఇక సీఎం పర్యటన నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు అధికారులు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. జగన్ పాల్గొనే సభా ఏర్పాట్లను ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించారు.
Web TitleChief minister Jagan tour in Vizianagaram district today
Next Story