
ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గాయి అనుకొనేలోగానే విశాఖలో మరో కేసు కలకలం రేపింది. తాజాగా గాజువాకలోని మటన్ వ్యాపారికి కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.
ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గాయి అనుకొనేలోగానే విశాఖలో మరో కేసు కలకలం రేపింది. తాజాగా గాజువాకలోని చికెన్ వ్యాపారికి కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ ఘటనతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సదరు వ్యాపారి మాంసం అమ్మినట్టు అధికారులు గుర్తించారు. అతడి దగ్గర చికెన్ కొనుగోలు చేసిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే అతడి దగ్గర మాంసం కొనుగోలు చేసిన దాదాపు 14 మంది వివరాలను కనుగొన్నట్టు తెలుస్తోంది. మిగతా వారి వివరాలు కూడా తెలుసుకునేందుకు అధికారులు లు ప్రయత్నాలు వేగవంతం చేశారు. చికెన్ వ్యాపారి నుంచి మరికొందరికి కరోనా సోకకుండా చుట్టూ పక్కల ప్రాంతాలు శుద్ది చేస్తున్నారు.
అయితే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే వాదనలు వినిపిస్తోంది. కరోనా లక్షణాలతో వచ్చినవారి నుంచి నమూనాలు సేకరించి, రిపోర్ట్స్ వచ్చేంత వరకు ఐసోలేషన్ వార్డులోనో, క్వారంటైన్ సెంటర్‌కో తరలించి చికిత్స అందించాలి. కానీ, గాజువాకకు చెందిన చికెన్ వ్యాపారి నుంచి నమూనాలు సేకరించిన అనంతరం హోమ్ క్వారంటైన్ లో ఉంచారు. అతనిపై నిఘా పెట్టలేదని ఆరోపణలు వస్తున్నాయి. దాంతో అతడు ఎప్పటిలాగే వ్యాపారం చేసుకున్నాడని తెలుస్తోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




