'ఏమన్నా... కోడికూర కావాలా'..?

ఏమన్నా... కోడికూర కావాలా..?
x
Highlights

‘ఏమన్నా... కోడికూర కావాలా? మా దగ్గర చాలా ఛీపు. రండి రండి ఎనభై రూపాయలకే కేజీ ఇత్తాం’ అంటూ వ్యాపారుల పిలుపు.

సూళ్ళూరుపేట: 'ఏమన్నా... కోడికూర కావాలా? మా దగ్గర చాలా ఛీపు. రండి రండి ఎనభై రూపాయలకే కేజీ ఇత్తాం' అంటూ వ్యాపారుల పిలుపు. 'మరీ అంత తక్కువా? ఐతే కేజీ కొట్టు. మంచి ఛాన్స్‌ ఇదే. ఫుల్లుగా లాగిం చేయాలి!' అంటూ వినియోగదారుల సంతోషం. ఇదీ మంగళవారం సూళ్ళూరుపేటలో పరిస్థితి. వ్యాపారుల మధ్య పోటీ కారణంగా, చికెన్‌ ధర అమాంతం తగ్గించేశారు.

ఈ లెక్కన కిలో చికెన్‌ రూ.100కే దొరుకుతుండడంతో, వినియోగదారులు భారీగా ఎగబడ్డారు. దీంతో మిగిలిన వ్యాపారులూ 'చౌక బేరం' మొదలుపెట్టారు. మంగళవారం స్థానిక మార్కెట్ రోడ్డు, వై జక్షన్ సర్కిల్‌లో వ్యాపారం జనం ఎగబడ్డారు.

ఒక్క రోజులోనే 200 కిలోలకు పైగా, చికెన్‌ అమ్ముడుబోయినట్లు స్థానిక వ్యాపారి తెలిపారు. వ్యాపారులు ధర భారీగా తగ్గించడంతో, మామూలుగా అరకిలో తీసుకునే వారు కిలో నుంచి రెండు కేజీల చికెన్‌ తీసుకెళ్లారు. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో మాత్రం, బహిరంగ మార్కెట్లో స్కిన్‌లెస్‌ చికెన్‌ కిలో రూ.180, స్కిన్‌తో కలిపి రూ.150 ధర పలుకుతోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories