కరోనా దెబ్బకు వందలోపు తగ్గిన చికెన్ ధరలు

కరోనా దెబ్బకు వందలోపు తగ్గిన చికెన్ ధరలు
x
Highlights

రెండు వారాల క్రితం వరకు, మార్కెట్లో కిలో 180 నుంచి 200 రూపాయల వరకు పలికిన కోడిమాంసం ధర, కరోనా వైరస్ దెబ్బకు సగానికి సగం పడిపోయంది.

సూళ్ళూరుపేట: రెండు వారాల క్రితం వరకు, మార్కెట్లో కిలో 180 నుంచి 200 రూపాయల వరకు పలికిన కోడిమాంసం ధర, కరోనా వైరస్ దెబ్బకు సగానికి సగం పడిపోయంది. పండుగల పూట కూడా మాంసాహారం మానని దేశప్రజలు, కరోనా వైరస్ కలిగిస్తున్న భయాందోళనలకు జడిసి, ప్రత్యేకించి కోడి మాంసాన్ని వద్దంటే వద్దంటున్నారు. ఫలితంగా మార్కెట్ ఢమాలుమంది. ఉదాహరణకు నెల్లూరుజిల్లాలోని సూళ్ళూరుపేట, తడ, నాయుడుపేటలో బుధవారం మాంసం మార్కెట్లలో కిలో చికెన్ పోటీపడటం కాదు, తగ్గడంలో పోటీ పడి 80 రూపాయలకు పడిపోయింది. చికెన్ తీసుకోవాలంటే భయపడిపోతున్న నేపథ్యంలో సూళ్ళూరుపేట, తడ, నాయుడుపేటలో వ్యాపారాలు పోటీలు పడి మరీ, చికెన్ ధరను సగానికి సగం పైగా తగ్గించి మరీ అమ్మారు.

ఇప్పుడు ఆ ధరకు కూడా ఎవరూ చికెన్ కొనకపోవడంతో, కిలో వంద రూపాయల నుంచి 80 రూపాయలకు తగ్గించి అమ్మడం ప్రారంభించారు. వంద రూపాయలకు కిలో చికెన్ బేరం దొరకడంతో, వినియోగదారులు పోటీలు పడి మరీ ఎగబడ్డారు. కోడికూరా కావాలా.. రండి రండి బాబూ కిలో ఎనభై రూపాయలకే ఇత్తాం అంటూ... వ్యాపారులు ఆహ్వానాలు పలుకుతుండటంతో ఇదే సందని భావించిన వినియోగదారులు రెండు, మూడు కేజీల వంతున పోటీ పడి మరీ పట్టుకుపోయారు. దీంతో ఒక్కరోజులోనే సూళ్ళూరుపేట, తడ, నాయుడుపేట పట్టణంలో ఒక్కో వ్యాపారి వద్ద 200 కిలోలకు పైగా కోడిమాంసం అమ్మడుపోయింది.

వ్యాపారులు ధర భారీగా తగ్గించడంతో, మామూలుగా అరకిలో తీసుకునే వారు కిలో నుంచి రెండు కేజీల చికెన్‌ తీసుకెళ్లారు. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో మాత్రం బహిరంగ మార్కెట్లో, స్కిన్‌లెస్‌ చికెన్‌ కిలో రూ.180, స్కిన్‌తో కలిపి రూ.150 ధర పలుకుతోంది.కరోనా వైరస్ మనుషుల ప్రాణాలు అమాంతంగా తీసేయడమే కాకుండా, కోడి మాసం ధరను కూడా భారీగా తీసేసింది. తెలుగు రాష్ట్రాల్లోని నగరాలు, పట్టణాల్లో సైతం, కిలో చికెన్ వంద నుంచి 120 రూపాయల లోపు పడిపోవడం గమనార్హం. కొన్ని చోట్ల కోడి గుడ్లు కూడా సగం ధర పడిపోయి, 30 రూపాయలకే డజన్ గుడ్లు అమ్ముతున్నట్లు తెలిస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories