ఆ పోస్టులతో నాకు సంబంధం లేదు : ఎమ్మెల్యే చెవిరెడ్డి

ఆ పోస్టులతో నాకు సంబంధం లేదు : ఎమ్మెల్యే చెవిరెడ్డి
x
Highlights

ఆ పోస్టులతో నాకు సంబంధం లేదు : ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆ పోస్టులతో నాకు సంబంధం లేదు : ఎమ్మెల్యే చెవిరెడ్డి

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, చిరంజీవి భేటిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, ఆ పార్టీ కీలక నాయకుడు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పేరిటి ఫేస్‌బుక్‌ లో పెట్టిన పోస్ట్‌ దుమారాన్ని రేపింది. అయితే ఈ పోస్టుపై స్పందించారు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. మెగాస్టార్ చిరంజీవితో తనకు ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. తన అభిమాన సంఘం పేరిట చిరంజీవి, ఆయన కుమారుడు రాంచరణ్ తేజ్ పై సోషల్‌మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న వార్తల్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తనకు సొంతంగా ట్విట్టర్‌ కాని, ఫేస్‌బుక్‌ అక్కౌంట్లుగాని లేవని స్పష్టం చేశారు.

కావాలనే ఇలా చేశారని చెప్పారు. తాను తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా ఉన్నసమయంలో చిరంజీవి తిరుపతి ఎమ్మెల్యేగా ఉండేవారని.. అప్పటినుంచి చిరంజీవితో తనకు మంచి సంబంధాలే ఉన్నాయన్నారు. జగన్, చిరంజీవి మధ్య సంత్సబంధాలు ఉండకూడదన్న కుట్రతోనే తెలుగుదేశం పార్టీయే ఈ దుష్ప్రచారం చేస్తుందని చెవిరెడ్డి ఆరోపించారు. తనకు ఎలాంటి అభిమాన సంఘాలు లేవన్న చెవిరెడ్డి.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే తాను అభిమానిని అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories