గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ గా ఏసురత్నం

గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ గా ఏసురత్నం
x
Highlights

గుంటూరు మిర్చి యార్డు(వ్యవ సాయమార్కెట్‌ కమిటీ, గుంటూరు) నూతన కమిటీని ప్రకటించింది ప్రభుత్వం. మిర్చియార్డు చైర్మన్‌గా వైసీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ...

గుంటూరు మిర్చి యార్డు(వ్యవ సాయమార్కెట్‌ కమిటీ, గుంటూరు) నూతన కమిటీని ప్రకటించింది ప్రభుత్వం. మిర్చియార్డు చైర్మన్‌గా వైసీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి చంద్రగిరి ఏసురత్నం నియమితులయ్యారు. అలాగే వైస్‌ చైర్మన్‌గా శృంగవరపు శ్రీనివాస రావు (ఎర్రబాబు)ని ప్రభుత్వం నియమించింది. ఇవాల్టినుంచి నూతన కమిటీ పదవి బాధ్యతలు చేపట్టనుంది. ఈ మేరకురాష్ట్ర వ్యవసాయ, సహ కార, మార్కెటింగ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి గౌరవ అధ్యక్షుడిగా స్థానిక ఎమ్మెల్యే మద్ధాళి గిరిధర్‌ వ్యవహరిస్తారు. వీరితో పాటు పాలకవర్గ సభ్యులను కూడా నియమించింది.

కమిటీ సభ్యులుగా మట్టికొయ్య రాణి స్వర్ణలత, అంగిరేకుల పూర్ణ వెంకట గోపికృష్ణ, కాకి భాగ్యలక్ష్మి, పరసా లక్ష్మీకృష్ణారావు, కేసరి సుబ్బులు, గంటా మరియమ్మ, వడ్లమూడి రత్న, షేక్‌ పర్వీన్‌, యర్రం కృష్ణారెడ్డి, షేక్‌ షబ్బీర్‌ అహ్మద్‌, పంది రామలక్ష్మి, కంజుల జైశంకర్‌రెడ్డి, వెంపాటి నాగిరెడ్డి, జీడీసీఎంఎస్‌ అధ్యక్షురాలు కత్తెర క్రిష్టినా, వ్యవసాయ శాఖ ఏడీ, మార్కె టింగ్‌ ఏడీ, మునిసిపల్‌ కార్పొ రేషన్‌ స్పెషలాఫీసర్‌ అయిన జిల్లా కలెక్టర్‌ ఐ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌లను ప్రభుత్వం నూతన కమిటీలో భాగస్వామి చేసింది. ఈ కమిటీ ఏడాది పాటు సేవలందించనుంది. కాగా మిర్చి యార్డు కమిటీ చైర్మన్ పదవికి పలువురు నేతలు పోటీ పడ్డారు.

మిర్చి యార్డు పరిధిలోకి గుంటూరు ఈస్ట్, వెస్ట్, పత్తిపాడు, పోన్నూరు నియోజకవర్గాలు వస్తాయి. పత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత హోమ్ మంత్రి కావడంతో డైరక్టర్ల ఎంపిపై ఆమె పెద్దగా జోక్యం చేసుకోలేదు. ఈ భాద్యతను గుంటూరు ఈస్ట్, వెస్ట్ వైసీపీ ఇంచార్జ్ తోపాటు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, గుంటూరు పార్లమెంటు వైసీపీ అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి తీసుకున్నారు. డైరెక్టర్ పదవుల కోసం పలువురు ఎమ్మెల్యేలు పేర్లను సూచించారు. ఎమ్మెల్యేలను కూడా పాలకవర్గం ఎంపికలో భాగం చేశారు. ఇదిలావుంటే మిర్చి యార్దు పాలకవర్గం గడువు ముగిసి ఏడు నెలలు అవుతున్నా. నూతన పాలక వర్గాన్ని ఏర్పాటు చేయలేదు. దాంతో అప్పటినుంచి స్పెషల్ ఆఫీసర్ ఈ బాధ్యతలను చూస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories