బీసీజీ గ్రూప్‌తో విజయసాయిరెడ్డి అల్లుడికి సంబంధాలు: చంద్రబాబు

బీసీజీ గ్రూప్‌తో విజయసాయిరెడ్డి అల్లుడికి సంబంధాలు: చంద్రబాబు
x
Highlights

బీసీజీ నివేదికపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీసీజీ నివేదిక పెద్ద బూటకమన్నారు. బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూపుకు అసలు...

బీసీజీ నివేదికపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీసీజీ నివేదిక పెద్ద బూటకమన్నారు. బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూపుకు అసలు తలా లోకా ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం రాసిచ్చిన దానిని జీఎన్ రావు చదివారని ఆరోపించారు. ఈ రెండు కమిటీలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేందుకు ఏర్పాటు చేసుకున్నవి అన్నారు. బీసీజీ గ్రూప్‌తో విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డికి సంబంధాలు ఉన్నాయని.. రోహిత్‌రెడ్డి చెప్పిందే బీసీజీ నివేదికలో పేర్కొన్నదని ఆరోపించారు. తప్పుడు నివేదికలతో ప్రజలను మోసం చేయడం మానుకోవాలని హితవు పలికారు. అమరావతి ప్రాంతమే రాజధానికి అనుకూలమని స్వయంగా శివరామకృష్ణ కమిటీయే చెప్పిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మరోవైపు బీసీజీ, జీఎన్‌రావు కమిటీకి ఉన్న విశ్వసనీయతలు ఏంటో ప్రజల ముందు ఉంచాలని ఏంటని .. ప్రజల వద్దకు వెళ్లకుండా, వారి అభిప్రాయాలను గౌరవించకుండా అమరావతిని ఫెయిల్యూలర్ సిటీలతో పోలుస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు.

తాము అధికారంలో ఉన్నప్పుడే విశాఖను మెగాసిటీగా తయారు చేశామన్న చంద్రబాబు. అక్కడ కొత్తగా అభివృద్ధి చెయ్యాల్సింది ఏముందని అన్నారు. పైగా విశాఖ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధికి వైసీపీనే ఇబ్బందులు సృష్టించిందని ఆరోపించారాయన. గత ఐదేళ్లలో విశాఖను పలు రంగాల్లో అభివృద్ధి చేసి.. దేశంలోనే ది బెస్ట్‌ సిటీగా తయారు చేసినట్టు చంద్రబాబు వెల్లడించారు. కాగా ఇవాళ ఉదయం అమరావతిలో రైతు కొమ్మినేని మల్లిఖార్జున్‌రావు ఆకస్మిక మృతిపై చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. గుండెపోటుతో మల్లిఖార్జున్‌రావు చనిపోవడం బాధాకరమని అన్నారు.. భూములు వేలాది మంది రైతులు తీవ్రమైన మనోవేదనతో ఉన్నారని దుయ్యబట్టారు. అసమర్ధ పాలన వలన అమాయక రైతులు బాలి అయిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories