కేసీఆర్, జగన్ లపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు

కేసీఆర్, జగన్ లపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు
x
Highlights

సుడిగాలి పర్యటన చేస్తోన్న సీఎం చంద్రబాబునాయుడు తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ప్రతిపక్షనేత జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసీపీ నాయకుల నెత్తిపై...

సుడిగాలి పర్యటన చేస్తోన్న సీఎం చంద్రబాబునాయుడు తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ప్రతిపక్షనేత జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసీపీ నాయకుల నెత్తిపై వెయ్యి రూపాయలు పెడితే.. పది రూపాయలకు కూడా కొనే పరిస్థితి లేదన్నారు. జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ దగ్గర కూలి పనిచేస్తున్నారని ఆరోపించారు. వారి వల్ల దేశానికి, రాష్ట్రానికి భారం తప్ప ప్రయోజనం లేదన్నారు. జగన్ తన ప్రచారాన్ని సాయంత్రానికి ముగించుకుని లోటస్ పాండ్ చేరుకుని, ఆపై కేసీఆర్‌కు రిపోర్ట్ చేస్తే అప్పుడు ఆయన జగన్‌కు డబ్బులిస్తాడని ఆరోపించారు. కాగా నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు, ఉదయగిరి, తరువాత ప్రకాశం జిల్లాలో కనిగిరి, ఆ వెంటనే గుంటూరులో వినుకొండ, ఆ వెంటనే నరసరావు పేటలో ఆయన ప్రచారం నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories