వచ్చే నెల 13 నుంచి అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటన

వచ్చే నెల 13 నుంచి అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటన
x
Highlights

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నవంబర్ లో మూడు రోజుల పాటు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే...

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నవంబర్ లో మూడు రోజుల పాటు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి చంద్రబాబు పర్యటన వివరాలు వెల్లడించారు. నియోజకవర్గాల వారిగా సమీక్షలు నిర్వహించేందుకు 13, 14, 15 తేదీల్లో అనంతపురంలో పర్యటిస్తారని.. ఈ సందర్బంగా ఆర్‌కే ఫంక్షన్‌ హాల్‌లో సమావేశం జరగనుందన్నారు. నియోజకవర్గాల వారిగా ఆయా నాయకులతో చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారని, నాయకులందరూ తప్పక హాజరుకావాలని పార్థసారథి కోరారు. సమావేశంలో మాజీ జడ్పీటీసీ చిన్నప్పయ్య, టీడీపీ నేతలు రొద్దం నరసింహులు, సంజీవరెడ్డి, సుబ్బరత్నమ్మ, నరేష్‌ పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories