Andhra Pradesh: ఇవాళ్టి నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన

Andhra Pradesh: వాళ్టి నుంచి మూడు రోజుల పాటు చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు

Sandeep Eggoju
Updated on: 25 Feb 2021 6:27 AM IST
Chandrababu Tour in Kuppam from Today
X

చంద్రబాబు (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: వాళ్టి నుంచి మూడు రోజుల పాటు చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. బెంగళూరు నుంచి కుప్పం చేరుకోనున్న ఆయన ఇవాళ గుడిపల్లి మండల కార్యకర్తలతో సమావేశమవుతారు. సాయంత్రం కుప్పం రూరల్ కార్యకర్తలతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ అత్యధిక స్థానాల్లో గెలుపొందింది. ఈ నేపథ్యంలో పార్టీ ఓటమికి గల కారణాలే ప్రధాన అంశంగా బాబు పర్యటన సాగనున్నట్లు తెలుస్తోంది.

కుప్పం పర్యటనలో రేపు ఉదయం తొమ్మిది గంటలకు ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు చంద్రబాబు. ఉదయం పది నుంచి రామకుప్పం మండల కార్యకర్తలతో సమీక్ష జరుపుతారు. మధ్యాహ్నం రెండు గంటలకు శాంతిపురం కార్యకర్తలతో భేటీ అవుతారు. ఎల్లుండి ఉదయం తొమ్మిది గంటలకు కుప్పం మున్సిపాలిటీ కార్యకర్తలతో బాబు సమావేశమవుతారు. అనంతరం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు బెంగళూరు వెళ్లి అక్కడి నుంచి సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడ వెళ్తారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story