కేబినెట్ కూర్పుపై చంద్రబాబు ఫోకస్.. పవన్‌కల్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు కీలక మంత్రి పదవి

Chandrababu to Discusses on Cabinet, Pawan to get Plum Post
x

కేబినెట్ కూర్పుపై చంద్రబాబు ఫోకస్.. పవన్‌కల్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు కీలక మంత్రి పదవి

Highlights

పవన్‌కల్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు కీలక మంత్రి పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

AP Cabinet: 164 సీట్లతో అధికారంలోకి వచ్చిన కూటమి.. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు చకచక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కేబినెట్ కూర్పుపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. పూర్తిస్థాయి కేబినెట్‌ ఉండేలా చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మంత్రివర్గ కూర్పుపై సమాలోచన చేయనున్నారు చంద్రబాబు. ఇప్పటికే పవన్‌తో పాటు బీజేపీ నేతలతో చంద్రబాబు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

ఇక పవన్‌కల్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు కీలక మంత్రి పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. భారీగా ఎమ్మెల్యేలు గెలుపొందడంతో కేబినెట్ ఎంపిక కత్తిమీదసాములా మారిందంటున్నారు పార్టీ శ్రేణులు. సామాజిక సమీకరణాలు, సీనియర్లతో పాటు పార్టీకి నిబద్ధత ఉన్నవారికి ప్రాధాన్యత ఇచ్చే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఎమ్మెల్యేలుగా గెలిచిన వారికి.. ఇక మహిళలకు కూడా కేబినెట్‌లో బెర్తులు ఉండే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories