అనుభవజ్ఞుడి అండ ఎంత అవసరమో యనమల నిరూపించారు : చంద్రబాబు

అనుభవజ్ఞుడి అండ ఎంత అవసరమో యనమల నిరూపించారు : చంద్రబాబు
x
అనుభవజ్ఞుడి అండ ఎంత అవసరమో యనమల నిరూపించారు : చంద్రబాబు
Highlights

మంత్రులు మండలిలో ఇష్టానుసారంగా వ్యవహరించారని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. మండలి ఛైర్మన్‌ అని చూడకుండా అసభ్య పదజాలంతో దూషించారని ఫైరయ్యారు....

మంత్రులు మండలిలో ఇష్టానుసారంగా వ్యవహరించారని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. మండలి ఛైర్మన్‌ అని చూడకుండా అసభ్య పదజాలంతో దూషించారని ఫైరయ్యారు. ఎంతో కష్టపడి రాష్ట్రానికి కంపెనీలు తీసుకొచ్చానని అవి ఇప్పుడు తిరిగి వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, జగన్‌ సీమకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

టీడీపీ నేతలతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కౌన్సిల్‌లో నిన్న టీడీపీ ఎమ్మెల్సీలు అసాధారణంగా పోరాడారని అభినందించారు. అనుభవజ్ఞుడి అండ ఎంత అవసరమో యనమల నిరూపించారని తెలిపారు. టీడీపీ యువ కౌన్సిలర్ల ధైర్యం, తెగువ ప్రశంసనీయమన్నారు. మండలి ఛైర్మన్‌ను వైసీపీ మంత్రులు అసభ్య పదజాలంతో దూషించారని మండిపడ్డారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories