Chandrababu: జనం మేల్కోకపోతే... రాష్ట్రానికి భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు

Chandrababu Slams Jagan in Idhem Karma Program in Eluru
x

Chandrababu: జనం మేల్కోకపోతే... రాష్ట్రానికి భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు

Highlights

Chandrababu: ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే పదవులు నాకు అవసరం లేదు

Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అరాచకుల చేతుల్లో విలవిల్లాడుతోందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. ఏలూరుజిల్లా పర్యటనలో ఆయన దెందులూరు నియోజకవర్గం పెద్దవేగి మండలం విజయరాయిలో ఎన్నికల శంఖారావం పూరించారు. జగన్ పాలనతీరూ తెన్నులను ఎండగడుతూ ఇదేంఖర్మ మనరాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని చేపట్టారు. నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు దారుణంగా ఉందని, రాష్ట్రంలో జగన్‌ పాలన దరిద్రంగా తయారైందన్నారు.

ఎన్నికల సమయంలోనే చెప్పిన విషయాన్ని పట్టించుకోనిజనం జగన్‌ పెట్టిన ముద్దులకు మురిసిపోయారని ఎద్దేవా చేశారు. మూడున్నర యేళ్లపాలనలో జగన్ రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. రాజధానే లేకుండా పాలిస్తున్నాడని ధ్వజమెత్తారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు పనుల్లో పురోగతి లేకుండా పోయిందన్నారు.

ఒక హింసావాది, నేర చరిత్రగలిగిన వ్యక్తికి ప్రజలు అమాయకంగా ముఖ్యమంత్రి పదవిని చేతిలోపెట్టి... రాష్ట్రాన్ని అప్పగించారని ఆవేదన వ్యక్తంచేశారు.

స్వార్థ ప్రయోజనంకోసం పాకులాడే వ్యక్తిని కాదని, ముఖ్యమంత్రిగా 14 యేళ్లు... ఎమ్మెల్యేగా 40 యేళ్లు పదవిని అనుభవించానన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తుకోసం ప్రజల్లో చైతన్యం, పోరాట పటిమ సరికొత్త ఉద్యమానికి నాందీప్రస్తావన కావాలని పిలుపునిచ్చారు. బాధ, ఆవేదన అంతా ముమ్మాటికీ రాష్ట్రకోసమేనని ప్రజలు గుర్తించాలని ప్రజలకు విన్నవించారు.

ఒక్క ఛాన్స్‌ ఇవ్వమని ప్రాధేయపడిన వ్యక్తి, సైకోలాగా వ్యవహరిస్తూ... ఊరికోసైకోలా మార్చేశాడని చంద్రబాబు విచారం వ్యక్తంచేశారు. ప్రజలు మేల్కోకుంటే.. రాష్ట్రం ఇబ్బందులపాలవుతొందన్నారు.

ఉన్మాదుల చేతుల్లోంచి ప్రభుత్వ అధికారాన్ని తప్పించేందుకు ప్రతి కార్యకర్త బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ప్రజలు వివేకంతో ఆలోచించి రాష్ట్ర భవిష్యత్తుకోసం సముచిత నిర్ణయం తీసుకోవాలన్నారు.

విజయరాయినుంచి చింతలపూడి బయలు దేరిన చంద్రబాబునాయుడు, టీడీపీ కార్యకర్తల కోలాహలం నడుమ లింగపాలెంలో రోడ్‌ షో నిర్వహించారు. మార్గమధ్యలో వైసీపీ నాయకులు చంద్రబాబు పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా వైసీపీ నాయకులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో చంద్రబాబు రోడ్‌షోలో కాసేపు గందరగోళపరిస్థితితో ఉద్రిక్తత నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories