ఆ ఒక్క విషయంలో ప్రభుత్వానికి అండగా ఉంటాం..!

ఆ ఒక్క విషయంలో ప్రభుత్వానికి అండగా ఉంటాం..!
x
ప్రతిపక్ష నేత చంద్రబాబు
Highlights

ఈ నేపథ్యంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఏపీ అసెంబ్లీలో చర్చకు తెరతీసింది

దిశ హత్యోదంతం దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. నిందితులను కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున ప్రజలు డిమాండ్ చేశారు. సీన్ రీ కన్‌స్ట్రక్షన్ క్రమంలో నిందితులు పోలీసుల నుంచి ఆయుదాలు లాక్కొని, పోలీసులపై రాళ్లదాడి చేయడంతో వారిపై జరిపిన ఎదురు కాల్పుల్లో నిందితులు హతమైన సంగతి తెలిసిందే. దిశ హత్య జరిన వారం రోజులకే నిందితులకు ఎన్‌కౌంటర్‌లో హతమవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది.

ఈ నేపథ్యంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఏపీ అసెంబ్లీలో చర్చకు తెరతీసింది. చట్టాలు మారాలి వేగంగా శిక్షలు విధించాలని అప్పుడే సమాజంలో మార్పు వస్తుందన్నారు. అందుకే, కేవలం మూడు వారాల్లోనే దోషులకు ఉరిశిక్ష పడేలా కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు అసెంబ్లీ వేదికగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.

ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతూ.. దిశ ఘటన ఎంతగానో కలిచివేసిందన్నారు. వైసీపీ ప్రభత్వం వచ్చిన తర్వాత కూడా మహిళలపై అఘాయిత్యాలు జరిగాయని వ్యాఖ్యానించారు. వీటిని అరికాట్టాల్సిన బాధ్యత ప్రభత్వాలకు ఉందన్నారు. చట్టాలను సవరించాలని, మహిళలపై దాడులు చేసే వారికి కఠిన శిక్ష పడాలన్నారు.

మహిళల రక్షణ కోసం ఏ చట్టం తీసుకొచ్చిస్తే ఈ విషయంలో ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తామన్నారు. మహిళల కోసం ఏ చట్టం తీసుకొచ్చిన దానిని సమర్థవంతంగా అమలు చేసినప్పుడే శిక్షలు పడతాయని అభిప్రాయపడ్డారు. నిందితులు ఎంతవారైనా తగిన శిక్షపడేలా చట్టాలు ఉండాలన్నారు. మహిళలపై చేయి వేయాలంటేనే భయమేయాని ఆలాంటి చట్టం ప్రభుత్వం తీసుకురావాలని సూచించారు. వైసీపీ ఎంపీపైనా అత్యాచారం కేసు ఉందని చంద్రబాబు గుర్తు చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories