Top
logo

ఆత్మహత్యలు వద్దు : చంద్రబాబు

ఆత్మహత్యలు వద్దు : చంద్రబాబు
Highlights

తెలంగాణాలో ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.. డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఒంటికి...

తెలంగాణాలో ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.. డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఒంటికి నిప్పంటించుకుని చనిపోగా, సురేందర్ గౌడ్ అనే కండక్టర్ ఉరేసుకుని చనిపోయాడు. అయితే ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్యలపై టీడీపీ నేత చంద్రబాబు స్పందించారు . జీవితం ఎంతో విలువైనది. ఏదైనా బతికి సాధించాలే తప్ప బలవన్మరణాల వల్ల సమస్యలు పరిష్కారం కావని అయన అన్నారు. కార్మికులందరూ తమ కుటుంబాల గురించి కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. నెల్లూరులో జరిగిన టీడీపీ నియోజకవర్గాల సమీక్షా సమావేశంలో పాల్గొన్న అయన ఈ అంశంపై స్పందించారు.

Next Story