జగన్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరు కావడం లేదు.

జగన్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరు కావడం లేదు.
x
Highlights

రేపు మధ్యాహ్నం విజయవాడలో ముఖ్యమంత్రిగా వై ఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సంగతి తెలిసిందిలే. ఈ ప్రమాణోత్సవానికి దేశ వ్యాప్తంగా నాయకులకు ఆహ్వానాలు...

రేపు మధ్యాహ్నం విజయవాడలో ముఖ్యమంత్రిగా వై ఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సంగతి తెలిసిందిలే. ఈ ప్రమాణోత్సవానికి దేశ వ్యాప్తంగా నాయకులకు ఆహ్వానాలు పంపించారు. కొందరిని జగన్ స్వయంగా కలిసి ఆహ్వానించారు. మరి కొందరిని ఫోన్ లో పిలిచారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడికి జగన్ స్వయంగా ఫోన్ చేసి తన ప్రమాణ స్వీకారానికి రావలసినదిగా ఆహ్వానించారు. అయితే, ఈ ప్రమాణ స్వీకారానికి వెళ్లకూడదని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. తమ పార్టీ తరఫున ఇద్దరు కీలక నేతలను జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పంపించాలని భావిస్తున్నారు. ఈ ఇద్దరు నేతలు ముందుగా రేపు ఉదయం ఉండవల్లి లోని జగన్ నివాసానికి వెళ్లి జగన్ ను కలుస్తారనీ, అక్కడ ఆయనకు అభినందనలు తెలిపిన అనంతరం మధ్యాహ్నం జరిగే ప్రమాణోత్సవానికి హాజరవుతారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories