ఇసుకపై ప్రభుత్వం పెత్తనం ఏంటి? : చంద్రబాబు

ఇసుకపై ప్రభుత్వం పెత్తనం ఏంటి? : చంద్రబాబు
x
చంద్రబాబు నాయుడు
Highlights

వైసీపీ పాలనా తీరుపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఫైర్ అయ్యారు.

వైసీపీ పాలనా తీరుపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఫైర్ అయ్యారు. జగన్ పాలన కారణంగా తాము చేసిన అభివృద్ధి అంతా వెనక్కి వెళుతోందని దుయ్యబట్టారు. కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు ఈరోజు నాలుగు నియోజకవర్గాల నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అసలు ఇసుక మీద ప్రభుత్వం పెత్తనం ఏంటని ప్రశ్నించిన చంద్రబాబు.. ప్రస్తుతం ఇసుక ధరను మూడురెట్లు పెంచేసి పేదల జేబుకు చిలులు పెడుతున్నారని విమర్శించారు. రాయలసీమకు హైకోర్టును ఇవ్వాలన్న డిమాండ్ ఉండగా.. తాము కర్నూలులో హైకోర్టు బెంచ్ ను కేటాయించినట్టు చంద్రబాబు తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడులు లేవు.. ఇన్వెస్టర్లు వెనక్కు వెళ్లిపోయారని అన్నారు. 40 కోట్లతో కర్నూలులో ఉర్దూ యూనివర్శిటీ ఇచ్చామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో దారుణ హత్యకు గురైన దిశా నిందితులను కఠినంగా శిక్షించాలని చంద్రబాబు కోరారు. ఇలాంటి వ్యక్తులకు భూమిపైన ఉండే హక్కు లేదని.. ఈ మృగాలకు ఉరి వేయడమే సరైన శిక్ష అని అన్నారు. కాగా రేపు ఆళ్లగడ్డ, కోడుమూరు, ఆలూరు, పత్తికొండ, నంద్యాల నేతలతో విడివిడిగా చర్చించనున్నారు. ఎల్లుండి బనగానపల్లె, పాణ్యం, శ్రీశైలం, కర్నూలు నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహిస్తారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories