కక్షసాధింపు ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నాం : చంద్రబాబు

కక్షసాధింపు ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నాం : చంద్రబాబు
x
Highlights

వైసీపీ ప్రభుత్వ ఫాక్షనిస్ట్ ధోరణి రానురానూ పరాకాష్టకు చేరుతోందని ఏపీ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంతి చంద్రబాబు అన్నారు. .ప్రతిపక్షాల...

వైసీపీ ప్రభుత్వ ఫాక్షనిస్ట్ ధోరణి రానురానూ పరాకాష్టకు చేరుతోందని ఏపీ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంతి చంద్రబాబు అన్నారు. .ప్రతిపక్షాల నాయకులు,కార్యకర్తలపై కక్షసాధింపుతో వారి ఉన్మాదం చల్లారలేదు. రైతులు, రైతుకూలీలు, మహిళలు, యువత, కార్మికులు అన్నివర్గాల ప్రజలను అష్టకష్టాలు పెట్టి, ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులపైనే ఫాక్షనిస్ట్ పంజా విసిరిందని అన్నారు. ప్రభుత్వ తీరుపై వరుస ట్వీట్లు చేశారు చంద్రబాబు.

3నెలలకు మించి వెయిటింగ్ లో ఉంటే ప్రభుత్వ ఉద్యోగులకు జీతం చెల్లించం అంటూ ఉత్తర్వులు ఇవ్వడం,6నెలల కన్నా ఒక్కరోజు వెయిటింగ్ లో ఉన్నా అసాధారణ సెలవుగా పరిగణిస్తామని అనడం వైసిపి కక్ష సాధింపునకు పరాకాష్ట.అధికారులను భయభ్రాంతులకు గురిచేసి లొంగదీసుకోవాలనే ఈ ఉన్మాదచర్యలను ఖండిస్తున్నామని అన్నారు.

"పోస్టింగ్ లు ఇవ్వకుండా వందలాది పోలీసు అధికారులను, సిబ్బందిని గత 8నెలలుగా తీవ్రంగా వేధిస్తున్నారు. ఇప్పుడు జీతాలు కూడా ఇచ్చేది లేదని ఉత్తర్వులు ఇవ్వడం దుర్మార్గ చర్య అని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా వెయిటింగ్ లో ఉంటే చర్యలు తీసుకోవాలిగాని, ప్రభుత్వమే వారిని వెయిటింగ్ లో ఉంచి, అవసరాల్లో సేవలు వాడుకుని, మళ్లీ వాళ్లపైనే చర్యలు చేపట్టడం అమానవీయం. ఇంత ఉన్మాద ధోరణిని పాలకుల్లో ఎప్పుడూ చూడలేదు. ఇంత కక్షసాధింపు ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నామని అన్నారు.

ప్రభుత్వం తప్పు చేసి, ఆ తప్పుకు ఉద్యోగులను శిక్షించడం ఎక్కడైనా ఉందా? ఎందుకు ఇంతమందిని, 8నెలల పైగా వెయిటింగ్ లో పెట్టారు? 3నెలలు కాగానే జస్టిఫికేషన్ తో ప్రభుత్వ సమీక్షకు ఎందుకని పంపలేదని ప్రశ్నించారు. పోస్టింగులు ఇవ్వకుండా నెలల తరబడి వెయిటింగ్ లో పెట్టి వేధించేది వీళ్లే,విధులకు హాజరుకాలేదని జీతాలు కోత పెట్టేది వీళ్లే. వెయిటింగ్ లో పంపినవాళ్లే, జీతాల్లో కోతపెట్టడం ఎప్పుడైనా జరిగిందా? ఇటువంటి వేధింపులు,బెదిరింపులు గతంలో ఉన్నాయా?ఇటువంటి దుర్మార్గచర్యలను ప్రతిఒక్కరూ ఖండించాలని చంద్రబాబు అన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories