'దిశ' చట్టంలో లోపాలున్నాయి : చంద్రబాబు

దిశ చట్టంలో లోపాలున్నాయి : చంద్రబాబు
x
Chandrababu File Photo
Highlights

ప్రభత్వంపై నిప్పులు చెరిగారు టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత చంద్రబాబు.

ప్రభత్వంపై నిప్పులు చెరిగారు టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత చంద్రబాబు. వైసీపీ అధికారంలోకి వచ్చి 9 నెలలైనా ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆయన ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ కుమారుడి వివాహానికి ఆయన హాజరయ్యారు. అనంతరం అమరావతికి తిరుగు పయనమవుతూ ఎయిర్ పోర్టులో మీడియాతో ఆయన మాట్లాడారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అక్రమ కేసులు పెడతారని ప్రజలు, వ్యాపారస్తులు భయపడుతున్నారన్నారు.

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈనెల 19 నుంచి ప్రజాచైతన్య యాత్ర ప్రారంభిస్తామని తెలిపారు. ప్రభుత్వ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే 'దిశ' చట్టంలో కొన్ని లోపాలున్నాయన్నారు. ప్రభుత్వం పంచాయతీ రాజ్‌ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ కొత్త చట్టం చేస్తున్నారని విమర్శించారు.

9 నెలలుగా 200 మంది పోలీసుకు జీతాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో ఒక సీనియర్‌ పోలీసు అధికారులను సస్పెండ్‌ చేస్తే పోలీసు అధికారుల సంఘం స్పందించదా? అని చంద్రబాబు నిలదీశారు. తన రాజకీయ జీవితంలో ఎలాంటి కోర్టు ఆక్షేపణలు లేవని చంద్రబాబు అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories