చంద్రబాబు ఆస్తుల కేసు విచారణ వాయిదా

చంద్రబాబు ఆస్తుల కేసు విచారణ వాయిదా
x
Highlights

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో విచారణ వాయిదా పడింది. హైదరాబాద్‌లోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)...

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో విచారణ వాయిదా పడింది. హైదరాబాద్‌లోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక న్యాయస్థానంలో కేసు విచారణ ఈ నెల 20కి వాయిదా వేశారు. చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసిన నందమూరి లక్ష్మీపార్వతి సాక్ష్యాన్ని నమోదు చేయాల్సి ఉండగా.. ఆమె తన తరఫున సీనియర్‌ న్యాయవాది హాజరవుతారని, అప్పటి వరకూ కేసు విచారణను వాయిదా వేయాలని కోర్టును కోరారు. దాంతో చంద్రబాబు ఆస్తుల కేసు విచారణ వాయిదా పడింది.

కాగా గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని ఆరోపిస్తూ 2005లో వైసీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీ పార్వతి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పట్లో ఈ కేసు విషయంలో హైకోర్ట్ విచారణ నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. అయితే, ప్రస్తుతం ఆ స్టే పై ఎటువంటి పొడిగింపు లేకపోవడంతో విచారణ ప్రారంభించాలని ఏసీబీ కోర్టు జడ్జి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో లక్ష్మీపార్వతి సాక్ష్యాన్ని నమోదు చేయాలని సూచిస్తూ కేసును గతనెల 25 వ తేదీకి వాయిదా వేశారు. అయితే అప్పట్లో కేసు విచారణ ప్రారంభంకాక ముందే చంద్రబాబు ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.. చంద్రబాబు అభ్యర్థనను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. ఆ తర్వాత బాబు హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయగా 2005లో స్టే వచ్చింది. అయితే సివిల్, క్రిమినల్‌ కేసుల్లో స్టే 6 నెలలకు మించకూడదని గతేడాది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబు కేసు మళ్ళీ మొదటికొచ్చింది. 2005 ఇచ్చిన స్టే గడువు ముగిసినందున ఇప్పుడు కేసు విచారణ కోనసాగుతుందని చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories