చంద్రబాబు అనంత పర్యటన ఉంటుందా?

చంద్రబాబు అనంత పర్యటన ఉంటుందా?
x
Highlights

పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకుల మనోస్థైర్యాన్ని పెంచడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు....

పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకుల మనోస్థైర్యాన్ని పెంచడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. జిల్లాలో బాబు పర్యటన నేడు డిసెంబర్ 18 న ప్రారంభమై డిసెంబర్ 20 తో ముగుస్తుంది. ఈ పర్యటన సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గ నాయకులతో చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు. ఆయా నియోజకవర్గాల్లోని పరిస్థితుల గురించి ఆరాతీస్తారు.వైసీపీ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారనే సందేశాన్ని జిల్లా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన రోజు నుండి జిమ్మిక్కులు చేసి, రివర్స్ టెండరింగ్ పేరుతో అన్ని రకాల అభివృద్ధి పనులను నిలిపివేసి రాష్ట్రానికి ఆదాయం కోల్పోయేలా చేశారని చంద్రబాబు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రిగా పాలనలో అనుభవం లేకనే రాష్ట్రాన్ని ఇలా అభివృద్ధి నిరోధకంగా మార్చారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.

వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చెయ్యాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తున్నారు. అందులో భాగంగా నేటినుంచి అనంతపురంలో పర్యటిస్తున్నారు చంద్రబాబు. కాగా వైసీపీ ప్రభుత్వం హయాంలో టీడీపీ నేతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆస్తులతోపాటు సర్వం కోల్పోయారని కొందరు టీడీపీనేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు వచ్చి తమలో దైర్యం నింపుతారని జిల్లా టీడీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు పర్యటన సందర్బంగా అనంత నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే రాజధాని విషయంలో సీఎం స్పష్టత ఇవ్వడంతో పార్టీ నేతలతో చర్చించే అవకాశం ఉంది కాబట్టి పర్యటన వాయిదా పడవచ్చని సమాచారం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories