ప్రభుత్వ వైఖరి మారకపోతే ముప్పు తప్పదు

ప్రభుత్వ వైఖరి మారకపోతే ముప్పు తప్పదు
x
Chandrababu
Highlights

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌కు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేస్తూ లేఖ రాశారు.

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌ కు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేస్తూ లేఖ రాశారు. కరోనా పాజిటివ్ విషయంలో తక్కువ లెక్కలు చెబుతున్నారనే ప్రచారం ఇప్పటికే ప్రజల్లో ఉందని పేర్కొన్నారు. కరోనా పాజిటివ్‌ కేసులను దాచిపెడుతున్నారని ఆరోపించారు. కర్నూలు, విజయవాడ, తూర్పు గోదావరి జిల్లాలో కరోనా వల్ల చనిపోయినా ప్రభుత్వం ఆ విషయాన్ని దాస్తున్నారని వార్తలు వస్తున్నాయన్నారు.

ప్రతిరోజూ విడుదల చేసే హెల్త్‌ బులెటిన్లు పూర్తి వివరాలతో పారదర్శకంగా, ప్రజలను అప్రమత్తం చేసేలా ఉండేలా చూడాలని అన్నారు. ప్రభుత్వం నిజాలను దాచిపెడితే పెనుప్రమాదంగా మారే అవకాశం ఉందని అన్నారు. కాబట్టి రాష్ట వ్రభుత్వం వాస్తవాలు చెప్పాలన్నారు.

రాష్ట్రంలో మహమ్మారిని కట్టడి చేయాలంటే ఎన్ని ఎక్కువ పరీక్షలు చేస్తే వచ్చే ఫలితాలను బట్టి కరోనాను అంతగా కట్టడి చేయొచ్చనేది ప్రపంచ దేశాల అధ్యయనాన్ని బట్టి తెలుస్తోందని చంద్రబాబు పేర్కన్నారు. రాష్ట్రంలో ల్యాబ్‌ల సంఖ్య పెంచాలని, ఎక్కువ మందికి టెస్టులు నిర్వహిస్తే పాజిటివ్‌ కేసులను సకాలంలో గుర్తించే వీలుంటుందని అన్నారు. తద్వారా ప్రత్యేక ఆస్పతుల్లో చికిత్స అందించడంతో కరోనా బాధితుల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే కాకుండా పరిసరప్రాంతాల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

కేంద్రం రూ.1. 75వేల కోట్ల ప్యాకేజి ప్రకటించిందని.. 8నెలల రేషన్‌ సరుకులు, 3 నెలల పింఛన్ ఒకేసారి పంపిణీ చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది అన్నారు. రాష్ట్రంలో అన్నా క్యాంటిన్లు తెరచి లాక్‌ డౌన్‌ వల్ల రాష్ట్రంలో ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకోవాలన్నారు. లక్షలాదిమంది రైతు కూలీలు,అసంఘటిత రంగ కార్మికులు ఉపాధి కోల్పోయారని, చేనేత, గీత కార్మికులు, మత్స్యకారులు, భవన నిర్మాణ కార్మికులు, జీవాల పెంపకం దారులు ఇలా చాలామంది పస్తులుండే పరిస్థితి ఏర్పడిందన్నారు.

కేంద్రం ఉపశమన చర్యలకు తోడుగా.. రాష్ట ప్రభుత్వం కూడా మరిన్ని చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. గత 11నెలలుగా మూతబడ్డాయని, ఆదుకోవాలన్నారు. వాటిని వెంటనే పున: ప్రారంభించి.. ఏ ఒక్కరూ పుస్తులు ఉండే పరిస్థితి లేకుండా చూడాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories