ఇవాళ మూడో రోజు కొనసాగనున్న బాబు పర్యటన

Chandrababu: వైసీపీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ బాబు పర్యటన

Rama Rao
Updated on: 13 May 2022 8:35 AM IST
Chandrababu is Touring in Kuppam | Telugu News
X

ఇవాళ మూడో రోజు కొనసాగనున్న బాబు పర్యటన

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ కుప్పంలో మూడో రోజు పర్యటించనున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ బాబు పర్యటన చేస్తున్నారు. రెండో రోజు కుప్పంలో పర్యటించిన చంద్రబాబు పట్టాలమ్మ జాతరలో పాల్గొన్నారు. గార్మెంట్స్ ఉద్యోగులు తమ సమస్యలను చంద్రబాబుకు చెప్పుకున్నారు.

యాజమాన్యాన్ని పిలిచి చర్చలు జరుపుతామని వారికి హామీ ఇచ్చారు చంద్రబాబు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయని చంద్రబాబు ఆరోపించారు. అలాగే రాజద్రోహ చట్టంపై చంద్రబాబు స్పదించారు. 124 ఏ అమలును నిలిపివేస్తూ, దేశ అత్యున్నత ధర్మాసనం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.


Rama Rao

Rama Rao

Next Story