కాసేపట్లో రామతీర్థానికి చంద్రబాబు

కాసేపట్లో రామతీర్థానికి చంద్రబాబు
x
Highlights

* రామతీర్థంలో రాజకీయ రగడ * ఇప్పటికే రామతీర్థంలో టీడీపీ, బీజేపీ నిరసనలు * పోటీగా ఆందోళనలకు సిద్ధమవుతున్న వైసీపీ

రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం ఘటనతో ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. నిన్నటి వరకు ఈ ఘటనపై అధికార పార్టీతో పాటు టీడీపీ, బీజేపీ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఇప్పుడు స్థానికంగా బీజేపీ, టీడీపీ ఆందోళనలకు దిగడంతో రామతీర్థం రగడ మరింత ముదిరింది.

చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసుల భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర నేతలతో పాటు పలువురు టీడీపీ నేతలు కూడా రామతీర్థం బయల్దేరారు. దీనితో ఎక్కడికక్కడే టీడీపీ నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రామతీర్థం ఘటనపై బీజేపీ ఆందోళనలు కొనసాగుతుండగా.. చంద్రబాబు కూడా పర్యటిస్తున్న నేపథ్యంలో టీడీపీ నేతలు కూడా శిబిరాలు ఏర్పాటు చేసుకొని నిరసనలకు దిగారు.


Show Full Article
Print Article
Next Story
More Stories